Breaking News

హిందుస్తాన్‌... హిందుస్తాన్‌...

Published on Sat, 08/16/2025 - 02:56

మేజర్‌ కుల్దీప్‌ సింగ్‌గా బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీ డియోల్‌ వెండితెరపైకి మళ్లీ వస్తున్నారు. సన్నీ డియోల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బోర్డర్‌ 2’. వరుణ్‌ ధావన్, దిల్జీత్‌ సింగ్, అహన్‌ శెట్టి, మేధా రాణా, మోనా సింగ్, సోనమ్‌ బజ్వా ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో మేజర్‌ కుల్దీప్‌ సింగ్‌ పాత్రలో కనిపిస్తారు సన్నీ డియోల్‌. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘బోర్డర్‌ 2’ సినిమాలోని సన్నీ డియోల్‌ పాత్ర తాలూకు మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

‘హిందుస్తాన్‌... హిందుస్తాన్‌... మేరీ జాన్‌ హిందుస్తాన్‌’ అనే పాటతో ఈ మోషన్‌పోస్టర్‌ సాగుతుంది. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వంలో భూషణ్‌ కుమార్, క్రిషణ్‌కుమార్, జేపీ దత్తా, నిధి దత్తా నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 22న విడుదల కానుంది. అయితే ఈ సినిమాను తొలుత జనవరి 23న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగా... జనవరి 22న విడుదల చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఇక 1971లో జరిగిన ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నేపథ్యంలో సన్నీ డియోల్‌ హీరోగా నటించిన ‘బోర్డర్‌’ (1997) సినిమాకు సీక్వెల్‌గా ‘బోర్డర్‌ 2’ రూపొందింది. ‘‘27 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఓ వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి ఓ సైనికుడు తిరిగి వస్తున్నాడు’’ అంటూ ఈ సినిమాను ప్రకటించిన సమయంలో ఈ చిత్రబృందం పేర్కొంది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)