Breaking News

కమెడియన్‌ కిడ్నాప్‌?.. కొద్ది గంటల్లోనే!

Published on Wed, 12/04/2024 - 20:53

నటుడు, కమెడియన్‌ సునీల్‌ పాల్‌ మంగళవారం కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని సునీల్‌ భార్య సరిత ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ఉన్నట్లుండి టచ్‌లో లేకపోయేసరికి కంగారుపడిపోయాను. అతడిని ఎవరో కిడ్నాప్‌ చేశారు. నేను పోలీసులను సంప్రదించగా వారు చాలా సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను కిడ్నాప్‌ చేసినవారి గురించి కూడా పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను అని పేర్కొన్నారు.

మిస్సింగ్‌..
ఏదో షోలో పొల్గొనేందుకు వేరే నగరానికి వెళ్లిన సునీల్‌ మంగళవారం తిరిగి ఇంటికొస్తానన్నాడు. అయితే ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా ఆయన ఇంటికి చేరుకోలేదు. పైగా ఫోన్‌కాల్స్‌ కూడా కనెక్ట్‌ కాకపోవడంతో కంగారుపడిపోయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్‌ రిపోర్ట్‌ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సునీల్‌ తన కుటుంబంతో టచ్‌లోకి వచ్చాడు. మంగళవారం రాత్రికల్లా తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

కాగా సునీల్‌ పాల్‌ 2005లో ద గ్రేట్‌ ఇండియన్‌ లాఫ్టర్‌ ఛాలెంజ్‌ షో విజేతగా నిలిచాడు. హమ్‌ తుమ్‌, ఫిర్‌ హేరీ ఫెరి, ఆప్నా సప్నా మనీ మనీ, బాంబే టు గోవా వంటి చిత్రాల్లోనూ నటించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)