పవన్‌ కల్యాణ్‌ సినిమాను ఎందుకు ఆపుతారు?: సునీల్‌ నారంగ్‌

Published on Sun, 06/08/2025 - 08:22

‘‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదలని కావాలని ఆపుతున్నారనడం తప్పు. ఆయన (పవన్‌ కల్యాణ్‌) సినిమాని ఎవరూ ఆపరు... ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్ట్స్‌ వీక్‌ నా సినిమా (‘కుబేర’ని ఉద్దేశించి) కూడా రిలీజ్‌కి ఉంది కదా? ఆయన సినిమా రిలీజ్‌ ఆపడం అనేది అసాధ్యం?’’ అని ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎస్‌ఎఫ్‌సీసీ) సమావేశంలో అధ్యక్షుడితో ΄ాటు కొత్త ΄ాలక మండలిని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిర్మాత సునీల్‌ నారంగ్‌ వరుసగా మూడోసారి ఎంపికయ్యారు. ఉ΄ాధ్యక్షులుగా రవీంద్ర గో΄ాల, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కె, సెక్రటరీగా శ్రీధర్‌ వీఎల్, జాయింట్‌ సెక్రటరీగా 
చంద్రశేఖర్‌ రావు జె, ట్రెజరర్‌గా సత్యనారాయణ గౌడ్‌ .బి ఎన్నికయ్యారు. అదే విధంగా 15 మంది ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులను కూడా ఎన్నుకున్నారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ– ‘‘అల్లు అరవింద్‌గారు, ‘దిల్‌’ రాజు, సురేష్‌బాబు, నా వద్ద థియేటర్లు ఉన్నాయనడం కరెక్ట్‌ కాదు. నా వద్ద 70 థియేటర్లు ఉంటే 40 బుకింగ్స్‌ ఉన్నాయి. 30 థియేటర్లు లీజ్‌ తీసుకున్నాం. అది కూడా గ్రౌండ్‌ లీజ్‌... ప్లస్‌ మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అవన్నీ కలిపినా కేవలం ఐదారు శాతం మాత్రమే ఉన్నాయి. అనవసరంగా ఆ నలుగురు అంటూ మాట్లాడటం తగదు. 

ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అందరి సినిమాలూ రావాలి, విడుదలవ్వాలని కోరుకుంటాం. హీరోలు ఏడాదికి ఐదు సినిమాలు చేయాలి, పది చేయాలి అని మాట్లాడటానికి నేను ఎవరు? అది వాళ్ల ఇష్టం. వాళ్ల పారితోషికం నిర్ణయించడానికి మేము ఎవరు? హీరోలు అనేవాళ్లు దేవుళ్లు. 145 కోట్ల దేశ జనాభాలో ఇరవై ముప్పై  మందే హీరోలున్నారు. లేదంటే నలభై మంది ఉంటారు. అలాంటి వాళ్ల గురించి నేను ఏం మాట్లాడాలో తెలియడం లేదు. సినిమా రిలీజైన 28 రోజులకే ఓటీటీలో విడుదల చేయడం అన్నది కూడా ఓ శత్రువులా మారింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో ఇండస్ట్రీలో నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్‌... ఎవరూ బాగాలేరు. కానీ, డిజిటల్‌ ప్రొవైడర్స్‌ అయిన వీఎమ్‌ఎస్, క్యూబ్‌ వాళ్లు, ఓటీటీ వాళ్లు బాగున్నారు. నాతో సినిమా తీయమని నిర్మాతలను ఏ డైరెక్టరూ, హీరో పిలవరు. మాకు ఇష్టం అయితే మేం వెళుతున్నాం... మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవరి ఇష్టం వారిది’’ అని తెలిపారు.

‘టీఎస్‌ఎఫ్‌సీసీ’ సెక్రటరీ శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ‘సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్‌ 2, కోర్ట్‌’ సినిమాల ద్వారానే ఎగ్జిబిటర్లకు డబ్బులు వచ్చాయి. మన హీరోలు ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేయాలని వినతి చేస్తున్నాను. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌లో టిక్కెట్‌ ధరలు, క్యాంటీన్‌ ధరలు సాధారణంగా ఉంటున్నాయి. కానీ, మల్టీప్లెక్స్‌లో ఎక్కువ ఉంటాయి. కావాలంటే రెండింటినీ పోల్చి చూడండి’’ అన్నారు. నిర్మాతలు సురేష్‌బాబు, కిరణ్, కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.  
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)