Breaking News

'మజాకా' ట్రైలర్‌లో పీపుల్స్‌ స్టార్‌.. తప్పు సరిచేసుకున్న సందీప్‌

Published on Sun, 02/23/2025 - 13:22

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్‌ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. నేను లోకల్,హలో గురు ప్రేమకోసమే,సినిమా చూపిస్త మావ ,ధమాకా వంటి సినిమాలతో దర్శకుడిగా త్రినాథరావుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన నుంచి మజాకా మూవీ వస్తుండటంతో ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి.

తాజాగా విడుదలైన మజాకా ట్రైలర్‌ టైటిల్‌ కార్డ్‌లో హీరో సందీప్‌ కిషన్‌కు 'పీపుల్స్ స్టార్' అనే ట్యాగ్‌లైన్‌ చేర్చారు. పీపుల్స్ స్టార్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ఆర్‌. నారాయణమూర్తి అని తెలిసిందే. దీంతో ఈ విషయంపై పలు అభ్యంతరాలు రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ఆర్ . నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ ట్యాగ్ లైన్ ఉన్న విషయం తనకు తెలియదని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు. తనకు ట్యాగ్ లైన్స్‌తో ఎలాంటి పనిలేదన్నారు. వాటిని పెద్దగా పట్టించుకోనని తెలిపారు. అయితే, నారాయమూర్తి సినిమాలు చాలా బాగుంటాయని, ఆయనకు తాను కూడా అభిమానినని  పేర్కొన్నారు. మజాకా సినిమా కోసం పీపుల్స్ స్టార్ అనే  ట్యాగ్ లైన్‌ను తాను పెట్టుకోలేదు.  నిర్మాత అనిల్ సుంకర పెట్టారని సందీప్ కిషన్ వివరణ ఇచ్చారు.

మజాకా చిత్రంలో సందీప్‌ కిషన్‌ - రావు రమేశ్‌ తండ్రీ తనయుల పాత్రల్లో సందడి చేయనున్నారు. తనయుడు ఒక అమ్మాయితో.. తండ్రి మరో అమ్మాయితో ప్రేమలో పడటం.. సరదాగా సాగే జీవితాల్లో వారికి వచ్చిన సమస్య ఏమిటి? దానిని వారెలా అధిగమించారు? అనే అంశాలతో ఈ సినిమా రూపొందుకున్నట్లు తెలుస్తోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)