Breaking News

కావాలని మాట్లాడలేదు: దర్శకుడు నక్కిన త్రినాథరావు

Published on Tue, 01/14/2025 - 02:50

సందీప్‌ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్‌ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.

అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్‌ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్‌ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన.  

త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్‌ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)