Breaking News

మజాకాతో పెద్ద హిట్‌ కొడుతున్నాం: సందీప్‌ కిషన్‌

Published on Tue, 02/18/2025 - 03:58

‘‘మజాకా’(Mazaka) సినిమా కోసం నెల రోజులుగా పగలు, రాత్రి చిత్రీకరణ చేస్తున్నాం. ఈ మూవీ కోసం మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. అందులో భాగంగా ఔట్‌డోర్‌లో జరుగుతున్న మా సినిమా షూటింగ్‌కి మీడియా వారు వచ్చినందుకు థ్యాంక్స్‌. ఈ నెల 26న ‘మజాకా’ చిత్రంతో పెద్ద హిట్‌ కొడుతున్నామనే నమ్మకం ఉంది’’ అని సందీప్‌ కిషన్‌ తెలిపారు.

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్‌ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్స్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. కాగా ఈ మూవీలోని ‘రావులమ్మ..’ అంటూ సాగే పాట చిత్రీకరణ షూటింగ్‌ ప్రస్తుతం ఔట్‌డోర్‌లో జరుగుతోంది. 

ఈ షూటింగ్‌ని లైవ్‌ ద్వారా ప్రేక్షకులకు చూపించారు మేకర్స్‌. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘రావులమ్మ’ ఫుల్‌ మాస్‌ అండ్‌ ఫోక్‌ సాంగ్‌. సందీప్, రీతు అద్భుతమైన డ్యాన్స్‌తో ఇరగదీశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం’’ అని చెప్పారు రీతూ వర్మ. ‘‘మజాకా’తో ఈసారి మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ కొడుతున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. ‘‘మా బ్యానర్‌లో ఇది బెస్ట్‌ సినిమా అని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు రాజేష్‌ దండా. రైటర్‌ ప్రసన్న కుమార్‌ బెజవాడ మాట్లాడారు.

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)