Breaking News

ఓ మంచి జ్ఞాపకంలాంటి సినిమా

Published on Sun, 08/17/2025 - 04:15

‘‘సుందరకాండ’ చిత్రం ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన ప్రభాస్‌గారికి థ్యాంక్స్‌. మా మూవీ ట్రైలర్, పాటలకి చాలా మంచి స్పందన వచ్చింది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాని కుటుంబమంతా చూడొచ్చు. వినాయక చవితికి మా చిత్రం విడుదలవుతుండటం సంతోషంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ ఈ సినిమా మంచి జ్ఞాపకంలా ఉంటుంది’’ అని నారా రోహిత్‌ చెప్పారు. 

వెంకటేశ్‌ నిమ్మలపూడి దర్శకత్వంలో నారా రోహిత్, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్‌ కుమార్‌ లీడ్‌ రోల్స్‌లో నరేశ్‌ విజయకృష్ణ, వాసుకి ఆనంద్‌ ఇతర పాత్రలుపోషించిన చిత్రం ‘సుందరకాండ’. సంతోష్‌ చిన్నపొల్ల, గౌతమ్‌ రెడ్డి, రాకేశ్‌ మహంకాళి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో శ్రీదేవి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ–‘‘చాలా కాలం తర్వాత ‘సుందరకాండ’ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

మంచి వినోదాత్మక చిత్రమిది... అందరూ సంతోషంగా చూడొచ్చు’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా వినాయక చవితి పండగ రోజు రిలీజ్‌ అవడం సంతోషంగా ఉంది. మా చిత్రం అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్‌ నిమ్మలపూడి. ‘‘మా సినిమాని చూసి, మా యూనిట్‌ని ఆశీర్వదించాలి’’ అని సంతోష్‌ చిన్నపొల్ల పేర్కొన్నారు. ‘‘సుందరకాండ’ లాంటి రొమాంటిక్‌ కామెడీ మూవీ ఇప్పటివరకు రాలేదు.. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నరేశ్‌ విజయకృష్ణ. నటి వాసుకి మట్లాడారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)