Breaking News

చంద్రముఖి సినిమా చూశాక ఒకటి ఫిక్సయ్యా: హీరోయిన్‌

Published on Wed, 06/07/2023 - 09:41

హీరోయిన్‌ సునయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెజీనా. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన డోమిన్‌ టి.సిల్వా ఈ మూవీని తెరకెక్కించారు. ఎలో బీయర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సతీష నాయర్‌ నిర్మించి, సంగీతాన్ని అందించారు. భవీ కె.భవన్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన రెజీనా చిత్ర టీజర్‌ మే 30వ తేదీన విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానికరాయపేటలోని సత్యం థియేటర్‌లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెంకట్‌ ప్రభు, నిర్మాత టి.శివ, చిత్రా లక్ష్మణన్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ మదన్‌, శక్తి పిలిమ్స్‌ ఫ్యాక్టరీ శక్తివేలన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వేదికపై సునయన మాట్లాడుతూ.. 2006లో అమ్మానాన్నల మధ్య కూర్చొని టీవీ సీరియల్స్‌ చూసే చిన్న అమ్మాయినని, అప్పట్లో తనకు నటిగా రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సెలవులకు హైదరాబాద్‌ వెళ్లినప్పుడు చంద్రముఖి, గజిని చిత్రాలను చూశానని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాది సినీ కథానాయిక అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి, సిన్సియారిటీ, నిజాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతల దగ్గర నుంచి యూనిట్‌లో ప్రతి ఒక్కరికీ సమైక్యత ఉందని సునయన అన్నారు.

చదవండి: ఆదిపురుష్‌.. మా అదృష్టం: ప్రభాస్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)