Breaking News

‘సుమతీ శతకం’ మూవీ రివ్యూ

Published on Fri, 02/06/2026 - 20:17

బిగ్‌బాస్‌ షో తర్వాత బుల్లితెర హీరో అమర్‌దీప్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. పలు టీవీ షోలతో పాటు సినిమా చాన్స్‌లు కూడా వస్తున్నాయి. బుల్లితెరపై ఓ మార్క్ వేసిన అమర్ దీప్ ఇప్పుడు హీరోగా ‘సుమతీ శతకం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
 
కథేంటంటే..
తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్ దీప్)కి పెళ్లిపై చాలా ఆశలు ఉంటాయి. ఊర్లోనే ఉంటూ కిరాణ కొట్టు నడుపుతుండడంతో అతనికి పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రారు. ఊర్లో జరిగే జాతరలో అందరి సమక్షంలో గుడిలో పెళ్లి చేసుకుంటానంటూ నాన్నమ్మకు ఇచ్చిన మాటను  నిలబెట్టలేకపోతోన్నందుకు కృష్ణ బాధపడుతుంటాడు. అలాంటి సమయంలో పక్క గ్రామానికి అంగన్వాడీ టీచర్‌గా వచ్చిన సుమతి(శైలి చౌదరి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. మరి కిరాణం కొట్టు నడిపే కృష్ణతో సుమతీ ఎలా ప్రేమలో పడింది? పెళ్లికి ఆమె పెట్టిన కండీషన్‌ ఏంటి? చివరకు కృష్ణ పెళ్లి జరిగిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఈ విలేజ్‌ లవ్‌స్టోరీకి భక్తి, సందేశాత్మక అంశాలు మేళవించి కమర్షియల్ పంథాలో సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ఎంఎం నాయుడు. ప్రారంభంలో కాస్త కథ ట్రాక్ తప్పినట్టుగా అనిపిస్తుంది. కానీ ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్‌కి కథలో లీనమయ్యేలా ప్రేక్షకుడ్ని కట్టి పడేస్తారు. అయితే ఇందులో ట్విస్ట్స్ పెద్దగా లేకపోవడం, ఊహకందేలా సాగడం,  విలనిజం కూడా గట్టిగా పండకపోవడంతో ఈ సినిమాకు మైనస్‌.అయితే ఎమోషనల్‌ సన్నివేశాలతో ఆ లోపాలను కొంతమేర కప్పిపుచ్చారు.పెళ్లి చుట్టూ రాసుకున్న కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ఎమోషన్ ఇలా అన్నింటినీ సమపాళ్లలో చూపించారు. కానీ ముందుగా చెప్పినట్లుగా ఊహకందేలా కథనం సాగడంతో కథనం రక్తి కట్టించదు. సరదాగా, సాఫీగా సాగే గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథలు ఇష్టపడే ప్రేక్షకులను ఈ చిత్రం నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే.. 
కృష్ణ పాత్రకు అమర్‌దీప్‌ న్యాయం చేశాడు. పల్లెటూరి యువకుడిగా కృష్ణ పాత్రలో అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ శైలి చౌదరి నటన పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఊరి ప్రెసిడెంట్‌గా మహేష్ విట్టా, హీరో స్నేహితుడిగా టేస్టీ తేజ కొన్ని సీన్లలో నవ్వులు పూయించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కెమెరా వర్క్‌ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని ఎంతో అందంగా చూపించారు. ఈ చిత్రంలోని చాలా విజువల్స్ బాగుంటాయి. రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను సినిమాటోగ్రాఫర్ ఎస్ హాలేష్ బాగా క్యాప్చర్ చేశారు. సుభాష్ ఆనంద్ ఇచ్చిన పాటల్లో పల్లెటూరి ఫీల్ వచ్చింది. నిర్మాత సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఖర్చు విషయంలో రాజీ పడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. 

రేటింగ్: 2.75/3

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)