Breaking News

దర్శన్‌తో గొడవ? ఇలాంటివాడికి ఆస్కార్‌ ఇవ్వాలంటూ నటి వరుస పోస్టులు!

Published on Wed, 03/12/2025 - 15:55

కన్నడ హీరో దర్శన్‌ (Darshan Thoogudeepa) చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అతడు సోషల్‌ మీడియా ఖాతాలో కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఆరుగురిని అన్‌ఫాలో కొట్టాడు. అందులో నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్‌, ఆమె తనయుడు అభిషేక్‌ ఉన్నారు. ఉన్నట్లుండి వీరిని అన్‌ఫాలో కొట్టడంతో దర్శన్‌ ఎందుకిలా చేశాడన్న చర్చ మొదలైంది. దర్శన్‌ కొడుకులాంటివాడని చెప్పిన సుమలత.. తాను జైల్లో ఉండగా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదన్న కోపంతోనే అతడు ఇలా చేసి ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.

అలాంటి వారు హీరోలా..!
ఈ నేపథ్యంలో సుమలత అంబరీష్‌ (Sumalatha Ambareesh) ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. తిమ్మిని బమ్మి చేసి, కాస్తైనా పశ్చాత్తాపపడకపోగా ప్రజలను బాధిస్తూ, అవతలివారిపైకి నిందను తోసేవారు ఇప్పటికీ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. ఇలాంటివారికి కదా ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ ఇవ్వాలి అని ఓ పోస్ట్‌లో రాసుకొచ్చింది. 

అవే అసలైన పునాది
మరో పోస్ట్‌లో.. ఎటువంటి విచారం, నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలేవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఆందోళనగా పరుగులు తీయకుండా శాంతియుతంగా గడపడం.. అనేవి ఒక నిధిలాంటివి. ఇవన్నీ సోషల్‌ మీడియాలో పనికొస్తాయో లేవో కానీ మన జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఈ అంశాలే మనల్ని మానసికంగా ధనవంతుల్ని చేస్తాయి అని మరో పోస్ట్‌ షేర్‌ చేసింది.

(చదవండి: రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా)

దర్శన్‌ను ఉద్దేశించి అనలేదు
దీంతో సుమలత ఈ రెండు పోస్టులు దర్శన్‌ను ఉద్దేశించే చేసిందన్న చర్చ జరుగుతోంది. దర్శన్‌, సుమలత మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లున్నాయని ఎవరికి వారు కథలు అల్లేసుకుంటుకున్నారు. ఈ క్రమంలో సుమలత సోషల్‌ మీడియా వేదికగా అది అబద్ధమని కొట్టిపారేసింది. నేను ఇంతకుముందు చేసిన పోస్టుల గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా నేను పరిశీలించిన అంశాలపై ఆ పోస్టు పెట్టానే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది అన్‌ఫాలో చేస్తున్నారు? అని చెక్‌ చేసే అలవాటు నాకు లేదు.

ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారు
దర్శన్‌.. ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ (ట్విటర్‌)లో ఎవరినీ ఫాలో అవకూడదని నిర్ణయించుకున్న విషయం నాకు మీడియా వల్లే తెలిసింది. దీన్నెందుకు భూతద్దంలో చూస్తున్నారో నాకు తెలియడం లేదు. దర్శన్‌ అన్‌ఫాలో అవడం, తర్వాత నేను పోస్టులు పెట్టడం అనేది అనుకోకుండా జరిగింది. అంతేతప్ప ఇందులో ఏమీ లేదు. అసలే గొడవా లేనిచోట ఏదో జరుగుతోందంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ప్రత్యేకంగా ఏ ఒక్కరినీ ఉద్దేశించిదని కాదని మళ్లీ చెప్తున్నాను.. నా కుటుంబ సభ్యులు, నా ఆప్తులు అనుకున్నవారితో సోషల్‌ మీడియాకు బదులుగా నేరుగానే మాట్లాడతాను అని సుమలత పేర్కొంది. కాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్‌, అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ అరెస్టయిన విషయం తెలిసిందే! వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్‌ మీదున్నారు.
 

 

 

చదవండి: ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్‌ బాబు సినిమా షూటింగ్‌!
ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)