Breaking News

ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!

Published on Mon, 07/31/2023 - 13:57

పసివాడి ప్రాణం సీరియల్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన సుజిత తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోనూ నటించి పెద్ద నటిగా ఎదిగింది. ఎంతో సాంప్రదాయంగా రెడీ అయ్యే సుజిత అన్నయ్య సూర్యకిరణ్‌ కూడా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ సత్తా చాటిన ఈయన బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్న వారం రోజులకే ఎలిమినేట్‌ అయ్యాడు. ఈయన నటి కల్యాణిని పెళ్లి చేసుకుని కొన్నేళ్లకే ఆమెకు విడాకులిచ్చాడు.

తాజాగా వీరి విడాకులకు గల కారణాన్ని సుజిత ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. 'అన్నయ్యకు పెళ్లయిన మూడేళ్లకే నాకు వివాహం జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్‌లోనే ఉండేదాన్ని. అప్పుడప్పుడు అన్నయ్యతో ఫోన్‌ మాట్లాడేదాన్ని. హైదరాబాద్‌కు షూటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. వదిన (కల్యాణి) అప్పటికే తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటి. తనతో మాట్లాడటం, తనతో ఉండటం నాకు చాలా ఇష్టం. అక్కాచెల్లెళ్లు ఎలా ఉండేవారో మేమిద్దరం అలా ఉండేవాళ్లం.

అయితే ఆర్థిక సమస్యలు అనేవి ఎక్కువకాలం ఉండకూడదు. అటువంటి ఇబ్బందులు వస్తే దాన్ని బ్యాలెన్స్‌ చేసే సామర్థ్యం దంపతుల్లో ఒక్కరికైనా ఉండాలి. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. వాళ్లిద్దరూ అనవసరంగా పెద్ద పెద్ద విషయాల్లో కాలు పెట్టారు. అన్నయ్య నిర్మాతగా సినిమా తీశాడు. నాకు చెప్తే సరేనన్నాను. అన్నయ్యకు, నాకు 8 ఏళ్ల ఏజ్‌ గ్యాప్‌. ఆయనకు సలహా ఇచ్చేంత పెద్ద దాన్ని కాదు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తనే నాకు తండ్రి లాగా! తనంటే నాకు కొంత భయం కూడా!

చివరకు వారు తీసిన సినిమా డిజాస్టర్‌ అయింది, నష్టాలు వచ్చాయి. అదే వారి జీవితంలో వచ్చిన పెద్ద సమస్య! మాకీ విషయం తెలిసి సాయం చేద్దామనుకునేలోపు వారు మరీ దారుణ స్థితిలోకి వెళ్లిపోయారు. అన్నీ అప్పులు, ఉన్నదంతా అమ్మేశారు. కేరళలో మంచి ప్రాపర్టీ ఉండేది, దాన్ని కూడా అమ్మేశారు. సినిమా అనేది గ్యాంబ్లింగ్‌. ఇది అందరికీ కలిసి రాదు.. ఉన్న డబ్బంతా సినిమా కోసం పెట్టడం అనేది తెలివితక్కువ తనం. ఈ ఒక్క పని వాళ్ల జీవితాన్ని ముంచేసింది' అని చెప్పుకొచ్చింది సుజిత.

చదవండి: దేశంలోనే రిచ్‌ హీరో.. కారు, బంగ్లాలు అమ్మేసి చివరి రోజుల్లో మురికివాడలో

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు