Breaking News

తమిళ పరిశ్రమలోకి సుహాస్‌.. శక్తికి మించి సంపాదించానంటున్న సూరి

Published on Tue, 04/22/2025 - 07:09

కోలీవుడ్‌ నటుడు సూరి హీరోగా నటిస్తున్న పలు సినిమాలను లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం మామన్‌ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మండాడి మూవీలో కూడా నటిస్తున్నాడు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఎల్‌రెడ్‌ కుమార్‌ తన ఆర్‌ఎస్‌.ఇన్ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం. కాగా ఆయన శిష్యుడు, సెల్షి చిత్రం ఫేమ్‌ మణిమారన్‌ పుగళేంది కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి మహిమా నంబియార్‌ నాయకిగా నటిస్తుంది. 

అదేవిధంగా మండాడి చిత్రం ద్వారా తెలుగు నటుడు సుహాస్‌ ముఖ్య పాత్రతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, ఎస్‌ఆర్‌.కదీర్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా త్వరలో చిత్ర షూటింగ్‌ ప్రారంభం కానుంది. చిత్రం కోసం ప్రత్యేకంగా చిత్రీకరించిన  ప్రోమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా నటుడు సూరి మాట్లాడుతూ.. తాను హీరోగా నటిస్తున్న మండాడి చిత్రం ప్రారంభ కార్యక్రమాన్నే ఇంత బ్రహ్మండంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం దర్శకుడు వెట్రిమారన్‌నే అన్నారు. 

తాను ఏమీ లేకుండా వచ్చాననీ, ఇప్పుడు శక్తికి మించే సంపాదించినట్లు చెప్పారు. అందువల్ల ఇకపై నచ్చిన చిత్రాలు చేస్తే చాలన్నారు. సర్వైవల్‌ అవ్వడానికి భగవంతుడి భాగ్యంతో కళామతల్లి చూసుకుంటుందన్నారు. ఇప్పటి వరకు సంపాదించింది చాలు.. ఇకనుంచి తన విజయానికి కారణమైన అభిమానులకు తనవంతుగా సాయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని ఆయన అన్నారు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు