Breaking News

నేను బతకొద్దా.. రెమ్యునరేషన్‌ పెంపుపై సుహాస్‌ వ్యాఖ్యలు

Published on Thu, 03/07/2024 - 19:12

ఒకప్పుడు చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ వచ్చిన సుహాస్‌.. ఇప్పుడు హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు. సక్సెస్‌ అన్న పదానికి నిర్వచనంలా మారాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న సుహాస్‌ ప్రస్తుతం ప్రసన్నవదనం అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సుహాస్‌కు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. 

అందుకే కొత్తవారికి ఛాన్స్‌
మీ రెమ్యునరేషన్‌ మూడు వేల నుంచి మూడు కోట్లకు పెంచారట కదా? అన్న ప్రశ్నకు సుహాస్‌ స్పందిస్తూ.. పారితోషికం పెంచాలి కదా! నేను బతకొద్దా.. జూనియర్‌ ఆర్టిస్టుగా రోజుకు వంద రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చాను. నాకూ ఎంతో కొంత తీసుకోవాలని ఉంటుందిగా! కాకపోతే మరీ మీరు అనుకున్నంత కాదు అని నవ్వేశాడు. ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశమివ్వడానికి కారణమేంటన్న ప్రశ్నకు.. ఎవరైనా మొదటి సినిమాను ప్రేమించినట్లు తర్వాతివాటిని ప్రేమించరు. అందుకే చాలామటుకు కొత్తవాళ్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు.

నా బతుకేంటో నాకే..
యూట్యూబ్‌ నుంచి మొదలై మంచి హీరోగా ఎదిగారు. కొత్తగా వచ్చే హీరోలకు ఏమైనా సందేశమిస్తారా? అన్న ప్రశ్నకు.. నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు.. నీ భవిష్యత్తు ఎవడికి కావాలి? అని ఓ డైలాగ్‌ ఉంటుంది.. నా పరిస్థితి కూడా అలాంటిదే! నేను హీరో అవుతాననే అనుకోలేదు. అంతా ఓ కలలా ఉంది. ఎవరైనా హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. షార్ట్‌ ఫిలింస్‌లో మన  టాలెంట్‌ చూపిస్తే సినిమా ఛాన్సులు అవే వస్తాయి అని సలహా ఇచ్చాడు.

చదవండి: Hanuman Movie: ఓటీటీలో హనుమాన్‌?.. ఇప్పట్లో లేనట్లేనా?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)