Breaking News

రికార్డు బ్రేక్‌ చేసిన డైరెక్టర్‌, 23 గంటల్లో సినిమా పూర్తి

Published on Mon, 06/26/2023 - 10:08

ఈ తరం దర్శకులు సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు. ప్రయోగాలతో గిన్నిస్‌ రికార్డులను సాధిస్తున్నారు. ఆ కోవలో తెరకెక్కిన చిత్రం కలైంజర్‌నగర్‌. దీనికి సుగన్‌కుమార్‌ కథ, కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈయన ఇంతకుముందు పోదాం అనే చిత్రాన్ని 23 గంటల 23 నిమిషాల్లో తెరకెక్కించారు. తన రికార్డును తానే బ్రేక్‌ చేస్తూ 23 గంటల 7 నిమిషాలకు ముందే తాజా సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడం విశేషం.

ఎస్‌ఆర్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ పతాకంపై శివరాజ్‌ నిర్మించిన ఈ చిత్రానికి గాయత్రి సుగన్‌ లైన్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇందులో నటుడు ప్రాజన్‌, నటి ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటించగా, నటుడు లివింగ్‌ స్టన్‌, పుగళ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. నరేశ్‌ సంగీతాన్ని, ఇళయరాజా ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్ర మీడియా సమావేశాన్ని శనివారం సాయంత్రం చైన్నెలో ని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు.

కార్యక్రమంలో బుల్లితెర నటీనటుల సంఘం అధ్యక్షుడు దళపతి పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు. ముందుగా చిత్ర దర్శకుడు సుగన్‌కుమార్‌ మాట్లాడుతూ పెద్ద పెద్ద దర్శకులు భారీ చిత్రాలను తెరకెక్కిస్తానని, తాను ఈ చిన్న చిత్రాన్ని భారీగా రూపొందించినట్లు చెప్పారు. ఇది పూర్తిగా స్టేజీ నృత్య కళాకారుల ఇతివృత్తంతో రూపొందించిన కథా చిత్రం అని తెలిపారు. ఇందులో మూడు పాటలు, రెండు ఫైట్స్‌ ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్‌ను 23 గంటల్లో పూర్తి చేసిన ఘనత తనది మాత్రమే కాదని దీనికి పనిచేసిన అందరికీ చెందుతుందని పేర్కొన్నారు.

చదవండి: నేను ఇంజనీర్‌ను.. హీరోయిన్‌ అవుతాననుకోలేదు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌