Breaking News

నేను ఎక్కడున్నా ఆమె నా గుండె‍ల్లోనే ఉంటుంది: సుడిగాలి సుధీర్‌

Published on Thu, 08/10/2023 - 10:37

బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌-యాంకర్‌ రష్మీ జోడికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కెమిస్ట్రీకి చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. రీల్‌ కపుల్‌గానే కాకుండా సుధీర్‌-రష్మి రియల్‌ కపుల్‌ అయితే బావుండు అని అనుకోని ప్రేక్షకులు ఉండరు. అంతలా స్క్రీన్‌మీద మెస్మరైజ్‌ చేస్తారు ఈ జంట. కానీ కొద్దిరోజులుగా ఈ జోడి మాత్రం స్క్రీన్‌పై ఒకటిగా కనిపించలేదు. సుధీర్‌ సినిమాలతో బిజీ అయితే.. రష్మీ మాత్రం పలు టీవీ షోలతో రానిస్తుంది.

(ఇదీ చదవండి; నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా)

తాజాగా వీరిద్దరూ ప్రముఖ టీవీ షోలో ఒకే స్క్రీన్‌పై మళ్లీ జంటగా కనిపించారు. దీంతో వారిద్దరీ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమోలో సుధీర్‌ వేసిన డైలాగ్‌లు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి. మేడం గారు ఎందుకో కొంచెం కోపంగా ఉన్నారంటూ రష్మీని ఉద్దేశించి సుధీర్‌ కామెంట్‌ చేస్తాడు.

అందుకు బదులుగా రష్మీ కూడా 'నువ్వు వస్తావని ఇన్నాళ్లు ఎదురు చూశాను' అంటూనే ఓర చూపులతో చిన్న స్మైల్‌ ఇస్తూ 'ఇన్నిరోజులు ఎక్కడున్నావ్‌..?' అని సుధీర్‌ను ఆమె ప్రశ్నింస్తుంది. ఇంతలో వెంటనే సుధీర్‌ తన స్టైల్‌లో 'నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం నా గుండె‍ల్లోనే ఉంటావ్‌' అంటూ డైలాగ్‌ పేలుస్తాడు. ఇంకేముంది ఫ్యాన్స్‌ కేకలతో రెచ్చిపోయారు. ఇలా సుమారు రెండేళ్ల తర్వాత మళ్లీ జోడిగా ఆ షోలో కనిపించారు.

పెళ్లిపై రూమర్స్‌
ఈ క్రమంలో వీరిద్దరు లవ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్‌ ఇప్పటికీ వినిపిస్తున్నాయి. గతంలో ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై రష్మి గౌతమ్‌ స్పందించింది. సుధీర్‌కి, నాకు మధ్య ఏం ఉందన్నది నా పర్సనల్‌ విషయం. ప్రతి విషయాన్ని బయటకు చెప్పుకుంటూ పోతే ఇంక పర్సనల్‌ ఏమీ ఉండదన్నది నా అభిప్రాయం అని ఆమె తెలిపింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు