Breaking News

రష్మి కాదు మరో యాంకర్‌తో సుడిగాలి సుధీర్ డేటింగ్?

Published on Mon, 04/13/2026 - 13:27

జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం యాంకర్‌గా పలు షోలకు హోస్టింగ్ చేస్తున్న సుడిగాలి సుధీర్ గురించి ఇప్పుడో న్యూస్ తెగ వైరల్ అవుతోంది. యాంకర్ దీపిక పిల్లితో ఇతడు ప్రేమలో ఉన్నాడని, వీళ్లిద్దరూ కలిసి విదేశాల్లో షికార్లు కూడా చేసేస్తున్నారని నిన్నంతా సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకున్నారు. దానికి కారణం ఓ ఫొటో. స్వయంగా దీపికనే దీన్ని తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసేసరికి అంతా నిజమనే అనుకున్నారు. ఇంతలోనే దీపిక ట్విస్ట్ ఇస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చేసింది.

(ఇదీ చదవండి: ఆమెతో బ్రేకప్‌.. గట్టిగా అరిచా, ఏంటేంటో చేసేశా : సుడిగాలి సుధీర్‌)

సుడిగాలి సుధీర్ పేరు చెప్పగానే రష్మినే గుర్తొస్తుంది. ఎందుకంటే నిజంగా వీళ్లిద్దరూ ప్రేమికులే అన్నట్లు ఆన్ స్క్రీన్‌ కెమిస్ట్రీ పండించారు. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని చాలాసార్లు చెప్పినప్పటికీ వీళ్లిద్దరూ ప్రేమికులే, త్వరలో పెళ్లి చేసుకుంటారేమో అని నెటిజన్లు ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ ఇప్పటివరకు సింగిల్‌గా ఉండటమే దీనికి కారణమని చెప్పొచ్చు. అయితే సుధీర్.. యాంకర్ దీపిక పిల్లితో క్లోజ్‌గా ఉన్న ఫొటో బయటకొచ్చేసరికి అంతా షాకయ్యారు. ఇదసలు ఊహించనేలేదుగా అనుకున్నారు.

ఇప్పుడు ఆ వైరల్ ఫొటోపై స్వయంగా దీపిక పిల్లి క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టింది. 'నా ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయింది. గతరాత్రి నా స్టోరీలో షేర్ అయింది 'ఏఐ' జనరేటెడ్ ఫొటో. నా అనుమతి లేకుండా దాన్ని పోస్ట్ చేశారు. దీన్ని మీరెవరూ షేర్ చేయొద్దు. గత 24 గంటల్లో నా ఖాతాలో పోస్ట్ అయిన ఏ కంటెంట్‌తోనూ నాకు సంబంధం లేదు. దీన్ని పెద్దగా పట్టించుకోవద్దు. ఈ సమస్యని పరిష్కరించే పనిలో ఉన్నా' అని దీపిక చెప్పుకొచ్చింది. సుధీర్-దీపిక కలిసి పలు షోలకు గతంలో హోస్టింగ్ చేశారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Videos

ఆ రోజు ఏంజరిగిందంటే.. విజయ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్..

ఛీ.. ఛీ.. సిగ్గుచేటు.. మరొక మహిళతో BR నాయుడు స్వామి వారిని దర్శించుకోవడం ఏంటీ

సింగర్ ఆశా భోస్లే అంతిమ యాత్ర

అత్తసొమ్ము అల్లుడుదానమా.. ఎవరి సొమ్ము ఎవడికి దానం చేస్తున్నావ్

సముద్ర దిగ్భందనం.. అమెరికా ఏడ్చే రోజు దగ్గరలోనే.. ఇరాన్ వార్నింగ్

కత్తులతో TDP గూండాలు.. YSRCP కార్యకర్తపై హత్యాయత్నం

మంగ్లీ బండారం బయటపెడతా.. పంజాగుట్ట PSలో హైడ్రామా.. బాధితులతో సుబ్బారావు

EPFO 3.0 తో ఎన్నో మార్పులు.. ఒకేసారి అకౌంట్లోకి రూ. 5 లక్షల వరకు డబ్బులు..!

లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..

అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..

Photos

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)