Breaking News

‘రావణాసుర’ లాంటి కథ తెలుగులో రాలేదు : సుధీర్‌ వర్మ  

Published on Wed, 04/05/2023 - 08:34

‘‘రవితేజగారితో ఫలానా జానర్‌ సినిమా చేయాలని ముందుగా అనుకోలేదు. రైటర్‌ శ్రీకాంత్‌ చెప్పిన కథ రవితేజగారికి నచ్చ డంతో దర్శకునిగా నేనైతే బావుంటుందని నా వద్దకు పంపించారు. థ్రిల్లర్‌ జానర్‌లో ‘రావణాసుర’ వంద శాతం కొత్త మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు’’ అని డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ అన్నారు.

రవితేజ హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘రావణాసుర’. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా సుధీర్‌ వర్మ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’లో థ్రిల్స్, షాకింగ్, సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్స్‌ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. అందులో ఏది ముందు చెప్పినా సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఆ థ్రిల్‌ ఉండదు.. వారికి ఆ అనుభూతిని ఇవ్వడానికే కథ గురించి చెప్పడం లేదు.

అయితే సినిమా చూసిన తర్వాత మన భావోద్వేగాలు మిస్సయిన ఫీలింగ్‌ ఆడియన్స్‌కి రాదని నా నమ్మకం. ‘రావణాసుర’ పూర్తిగా రవితేజగారి సినిమా. నటన పరంగా ఆయన సినిమాల్లో టాప్‌ త్రీలో ఈ మూవీ ఉంటుంది. ఈ సినిమాపై ఉన్న నమ్మకంతోనే రవితేజగారు ఓ నిర్మాతగా వ్యవహరించారు. అభిషేక్‌గారితో నేను చేసిన రెండో సినిమా ‘రావణాసుర’. నాపై నమ్మకంతో ఆయన సెట్స్‌కే రారు. ‘సుధీర్‌ ఏం అడిగితే అది ఇచ్చేయండి’ అని యూనిట్‌కి చెబుతారు.

‘అంతం’ మూవీలో నాగార్జునగారి, ‘సత్య’లో జేడీ చక్రవర్తిగారి పాత్రల్లో గ్రే షేడ్స్‌ ఉంటాయి. అయితే హీరోలని గ్రే షేడ్స్‌లో చూపించడం ఈ మధ్య ఎక్కువ అయింది. మణిరత్నంగారి ‘రావణ్‌’ సినిమాకి, మా ‘రావణాసుర’కి ఎలాంటి సంబంధం లేదు. ‘రావణాసుర’ని హిందీ, తమిళ్‌లో విడుదల చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. తెలుగులో విడుదలైన రెండో వారం నుంచి హిందీలో ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం నిఖిల్‌ హీరోగా నా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆ తర్వాత త్రివిక్రమ్‌గారి కథతో పవన్‌ కల్యాణ్‌గారితో నేను ఓ సినిమా చేసే అవకాశం ఉంది’’ అన్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)