Breaking News

న‌వ ద‌ళ‌ప‌తి 'సుధీర్ బాబు' పాన్ ఇండియా సినిమా ఫిక్స్‌

Published on Mon, 07/01/2024 - 14:38

వైవిధ్య‌మైన చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోన్న క‌థానా య‌కుడు సుధీర్ బాబు. న‌వ ద‌ళ‌ప‌తిగా అభిమానుల మ‌న్న‌న‌లు అందుకుంటున్న ఈయ‌న ఓ సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో న‌టించ‌బోతున్నారు. ఇది భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొంద‌నుంది.

ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఆడియెన్స్‌కి అందించేలా ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌బోతున్నఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధ్యాన‌త ఉంది. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. జూన్ 14న విడుద‌లైన‌ హ‌రోంహ‌ర చిత్రంతో సుధీర్ బాబు రీసెంట్‌గా స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. అందులో యాక్ష‌న్ స‌న్నివేశాలు, గ్రిప్పింగ్ క‌థ‌నానికి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో ఇప్పుడు సుధీర్ బాబు చేయ‌బోతున్ పాన్ ఇండియా సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ చిత్రం రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది. త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ఆ వివ‌రాల‌ను తెలియజేస్తారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయ‌నున్నారు.లోతైన క‌థ‌తో రానున్న ఈ చిత్రంలో కుట్ర, ప‌న్నాగాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచి జ‌రిగే యుద్ధంగా  ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ మూవీలా బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రంగా ఇది తెర‌కెక్క‌నుంది.

ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ 'నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది'. అని ఆయన అన్నారు.

ప్రేర‌ణ అరోరా, శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌న పురాణాల‌తో అనుసంధానం చేయ‌బ‌డిన ఎన్నో ర‌హ‌స్యాల‌ను ఇది వెలికి తీస్తుంది. ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా ఓ ప్ర‌త్యేక‌మైన అనుభూతిని క‌లిగిస్తుంది. సినిమా ఫ‌స్ట్ లుక్‌ను ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేయ‌నున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)