మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
హంట్: కనిపించని శత్రువు కోసం సుధీర్‌బాబు వేట!
Published on Mon, 08/29/2022 - 10:06
సుధీర్‌బాబు హీరోగా, శ్రీకాంత్, భరత్(‘ప్రేమిస్తే’ ఫేమ్) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి ‘హంట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సందర్భంగా వి.ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుధీర్‌బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసు పాత్రలు పోషించారు. కనిపించని శత్రువు కోసం హీరో జరిపే వేట ఈ చిత్రం ప్రధాన కథాంశం. సుధీర్‌బాబు గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో క్యారెక్టర్ విభిన్నంగా ఉంటుంది.
శ్రీకాంత్ పాత్ర ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. భరత్ తెలుగులో చేసిన తొలి స్ట్రయిట్ ఫిల్మ్ ఇదే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. మైమ్ గోపీ, కబీర్ దుహాన్ సింగ్, మౌనికా రెడ్డి, గోపరాజు రమణ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు సంగీతం: జీబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి.
చదవండి: ఒకే భవనంలో అపార్ట్‌మెంట్స్ కొన్న స్టార్ హీరోలు!
Tags : 1