Breaking News

హీరో సుధీర్ బాబుకి కొత్త ట్యాగ్.. సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్!

Published on Fri, 06/14/2024 - 17:06

తెలుగులో బోలెడు మంది హీరోలు. వీళ్లలో ఒక్కొక్కరికి ఒక్కో ట్యాగ్ ఉంటుంది. చిరంజీవికి మెగాస్టార్, మహేశ్ బాబుకి సూపర్ స్టార్, అల్లు అర్జున్‌కి ఐకాన్ స్టార్.. ఇలా దాదాపు స్టార్ హీరోలు చాలామందికి పేరుకి ముందు ఏదో ఓ ట్యాగ్ ఉంటుంది. కానీ కొందరు యంగ్ హీరోలు కూడా ఇలా ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయ పడుతున్నారు. తాజాగా సుధీర్ బాబు కూడా అలానే కొత్తగా ట్యాగ్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి.

(ఇదీ చదవండి: ‘హరోం హర’ మూవీ రివ్యూ)

స్టార్ హీరోలు పెట్టుకున్న ట్యాగ్ గురించి పెద్దగా కంప్లైంట్స్ ఉండవు గానీ ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకున్న హీరోలు ఎవరైనా ట్యాగ్స్ పెడితే కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మహేశ్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు.. చాలా ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాడు. నటుడిగా వంక పెట్టడానికేం లేదు. కానీ హిట్ మాత్రం దక్కట్లేదు. ఇప్పుడు పూర్తిగా మాస్‌ని నమ్ముకుని 'హరోం హర' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. కానీ 'పుష్ప', 'కేజీఎఫ్' సినిమాల పోలికలు మరీ ఎక్కువైపోయావని అంటున్నారు.

ఈ సినిమా ముందు వరకు 'నైట్రో స్టార్' అని పెట్టుకున్న సుధీర్ బాబు.. 'హారోంహర' కోసం 'నవ దళపతి' అని ట్యాగ్ మార్చుకున్నాడు. దళపతి అనగానే మనకు తమిళ హీరో విజయ్ గుర్తొస్తాడు. 'లియో' మూవీ టైటిల్ కార్డ్స్ లో విజయ్ కి పడ్డట్లే ఈ చిత్రంలో ఫొటోలు దాదాపు అలానే పడ్డాయి. దీంతో విజయ్-సుధీర్ బాబు ఫొటోలతో సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇకపోతే 'హరోంహర'లో సుధీర్ బాబుతో పాటు సునీల్, మాళవిక శర్మ కీలక పాత్రలు పోషించారు. 

(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)