Breaking News

ఓటీటీలో 'సుధీర్‌ బాబు' సినిమా.. నేడు సాయంత్రం నుంచే స్ట్రీమింగ్‌

Published on Mon, 07/15/2024 - 15:01

టాలీవుడ్ హీరో సుధీర్‌ బాబు, మాళవికా శర్మ జంటగా నటించిన చిత్రం  'హరోం హర'.  యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీగా గతనెల 14న విడుదలైంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఆగష్టు 11 నుంచి  స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ఆహా ప్రకటించి మళ్లీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ ఎక్స్‌ పేజీ వేదికగా కొత్త తేదీని ప్రకటించింది.

'హరోం హర' మూవీని నేడు (జులై 15) సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆహా తెలుగు  వెల్లడించింది. యాక్షన్ ప్యాక్డ్ మండే మూవీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ తమ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. నేడు సాయంత్రం 5 గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న హరోం హర సినిమాను మిస్ కావద్దంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది.

డార్క్‌ కామెడీ పేరుతో పలు వీడియోల వల్ల వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కూడా 'హరోం హర' సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రణీత్ హనుమంతు చేసిన కామెంట్స్ వల్ల అరెస్ట్ అయ్యాడు. దీంతో ఆహా ఓటీటీ సంస్థ సినిమా విడుదలను ఆపేసింది. అతడు నటించిన సీన్లను తొలగించి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీని జ్ఞానసాగర ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్‌ జి.నాయుడు నిర్మించారు.  
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)