మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
డబ్బింగ్ కోసం సుధీర్‌బాబు ఎంత కష్టపడుతున్నారో చూడండి
Published on Sun, 06/27/2021 - 19:21
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. . 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో సుధీర్‌బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తయినట్లు హీరో సుధీర్‌బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఓ ఫైట్ సీన్‌కు డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసుకున్నారు. ఇందులో ఫైట్‌కు తగ్గట్లు సుధీర్‌బాబు చెప్పిన డబ్బింగ్ తీరు ఆకట్టుకుంటుంది. డబ్బింగ్‌కే ఇంత కష్టపడుతుంటే, ఇక యాక్టింగ్‌కి ఇంకెంత కష్టపడతారో..మీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way 😃 😎
— Sudheer Babu (@isudheerbabu) June 26, 2021
#70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk
చదవండి : నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు
'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు'
Tags : 1