Breaking News

అర్థరాత్రి గదిలో మహిళ ఏడుపులు..కాళ్ల శబ్ధం, నాపై శక్తి దాడి : నటి

Published on Mon, 02/09/2026 - 14:19

ప్రముఖ నటి, నృత్యకారిణి సుధా చంద్రన్‌ పూనకానికి  సంబంధించిన ఓ వీడియో ఆ మధ్య సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సుధా చంద్రన్‌ ఇంట్లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె సడన్‌గా ట్రాన్స్‌లోకి వెళ్లిపోయింది. పూనకంతో ఊగిపోతూ వింతగా ప్రవర్తించింది. దీనిపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.  సుధా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, మద్యం తాగి అలా ప్రవర్తిస్తుందని కామెంట్‌ చేస్తూ ఆమెను విమర్శించారు. తాజాగా ఈ విమర్శలపై సుధా చంద్రన్‌ స్పందించారు.  అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూనే.. గతంలో తనకు ఎదురైన వింత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో  పంచుకుంది. 

మాములు మనిషి అలా చేయగలడా?
‘ఆ సమయంలో(పూనకం వచ్చినప్పుడు) నేను ఏ స్థితిలో ఉన్నానో నాకే తెలియదు. ఏం జరిగిందనే విషయం నా కుటుంబ సభ్యులు చెబితేనే తెలిసింది. కేవలం 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగానని నా భర్త చెప్పాడు. మాములు మనిషి అలా తాగగలడా? అమ్మవారే నాలోకి ప్రవేశించారని నేను చెప్పను. ఎందుకంటే అమ్మవారి శక్తిని మనిషి తట్టుకోలేడు. కానీ ఆమె ఆశిస్సులు నాపై ఉన్నాయని బలంగా నమ్ముతాను.  మద్యం తాగి నేను అలా ఊగిపోయానని కొంతమంది విమర్శించారు. అదంతా యాక్టింగ్‌ అని కూడా అన్నారు. అసలు అలా నటిస్తే నాకొచ్చే లాభం ఏంటి? నమ్మకం లేకపోతే వదిలేయండి అంతేకానీ ఇలాంటి విమర్శలు చేయడం సరికాదు. నా నమ్మకాలను ఎవరీకి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు’ అని సుధా చెప్పుకొచ్చింది.

ఏదో శక్తి వచ్చి నాపై పడింది
ఇదే ఇంటర్వ్యూలో షూటింగ్‌ సమయంలో తనకు జరిగిన ఓ వింత అనుభవం గురించి సుధా పంచుకుంది. ‘గుజరాత్‌లో షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ శక్తి నాపై దాడి చేసింది. ఆ రోజు షూటింగ్‌ పూర్తి చేసుకొని అర్థరాత్రి 11.30 గంటలకు గదిలోకి వెళ్లాను. నా పక్కన అమ్మ కూడా పడుకొని ఉంది. నేను నిద్రపోవడానికి ట్రై చేశా..కానీ మనసులో ఏదో అలజడి మొదలైంది.  అతీంద్రియ సంఘటనలు(పారానార్మల్‌ యాక్టివిటీ) చోటు చేసుకునే అవకాశం ఉంటే నాకు ముందే తెలిసిపోతుంది. ఆ గదిలో ఏదో శక్తి ఉన్నట్లు నాకు అనిపించింది. వెంటనే లేచి కూర్చున్నా. గదిలో ఉన్న ఓ కబోర్డ్‌ తెరచి ఉండడం గమనించా. అక్కడ నుంచి ఓ శక్తి నావైపు కదులుతూ వచ్చింది. అది నన్ను చేరినప్పుడు, నా ఛాతీపై భారీ బరువు నొక్కినట్లు అనిపించింది. 

నేను నోరు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ శబ్దం బయటకు రావడం లేదు. నా తల్లి నా పక్కనే ఉన్నప్పటికీ, నేను నా చేతులను కదపలేకపోయాను. ఆ శక్తి వింతగా అరుస్తూ నాలోకి ప్రశించినట్లుగా అనిపించింది. వెంటనే నేను కార్తిక్‌ దేవుడిని పేరుని జపించాను. ఏదోలా నా తల్లి చేతులను టచ్‌ చేశాను. వెంటనే నా గొంతు వచ్చింది. నా ఛాతీ బరువు కూడా తగ్గింది.  మా అమ్మ వెంటనే నాపై విభూతి చల్లింది. నేను సైలెంట్‌ అయిపోయా’ అని సుధా చెప్పుకొచ్చింది. అలాగే ఓ సినిమా షూటింగ్‌ కోసం సౌత్‌ ఇండియాకు వచ్చినప్పుడు కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది అట. ‘ షూటింగ్‌ కోసం సౌత్‌కి వెళ్లినప్పుడు రాత్రిపూట ఓ వ్యక్తి కాళ్ల చప్పుడుతో పాటు మహిళ ఏడుపులు కూడా వినించాయని.. తోటివారిని అడిగితే.. ఈ ప్రాంతంలో అలానే వినిపిస్తాయని చెప్పారు’ అని సుధా చెప్పుకొచ్చింది.

సుధా చంద్రన్ కెరీర్‌ విషయానికొస్తే..‘యే హై మొహబ్బతేన్’, ‘క్యుంకీ సాస్ భీ కబీ బహు థీ’ వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ‘నాగిన్’ సిరీస్‌లో యామిని రహేజా అనే పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌ ప్లే చేసింది.తెలుగులో మయూరి మూవీలో హీరోయిన్‌గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో ఆమె దాదాపుగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోషించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)