Breaking News

ఆ హీరోయిన్‌ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్‌

Published on Wed, 07/12/2023 - 10:28

ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్‌ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్‌ పెట్టిన కండీషన్‌ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్‌తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్‌కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది.

ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్‌ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్‌ 1 హీరోయిన్‌ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్‌ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్‌కు చూపించుకో' అని కౌంటర్‌ ఇచ్చింది.

సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది.

(చదవండి: ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ వద్దు.. పవన్‌ 'బ్రో'పై థమన్‌ సీరియస్ కామెంట్స్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)