Breaking News

స్టూడెంట్స్ ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టారు

Published on Wed, 07/16/2025 - 12:21

బాలీవుడ్‌లో మరో జంట గుడ్ న్యూస్ చెప్పేశారు. తెలుగులో 'భరత్ అను నేను', 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన కియారా అడ్వాణీకి ఆడపిల్ల పుట్టింది. మంగళవారం రాత్రి బిడ్డకు జన్మనివ్వగా.. బుధవారం కియారా-సిద్ధార్థ్ జంట తమకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఓ ఆసక్తికర విషయాన్ని కనిపెట్టారు. ఇప్పుడు అదికాస్త వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: హీరోతో 'బ్రహ్మముడి' సీరియల్ నటి నిశ్చితార్థం)

2012లో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' సినిమాతో ఆలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ పరిచయమయ్యారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆలియా భట్ ఇప్పటికే స్టార్ హీరోయిన్ అయిపోయింది. 2022లో హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకోగా అదే ఏడాది కూతురు రహాకి జన్మనిచ్చింది. కూతురితో ఆలియా ఎప్పటికప్పుడు మీడియా కంట పడుతూనే ఉంటుంది. ఈమె కూతురికి సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

వరుణ్ ధావన్ విషయానికొస్తే నటాషా దలాల్ అనే అమ్మాయిని 2021లో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్‌లో ఇతడికి కూడా కూతురు పుట్టింది. ఇప్పుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు కూడా కూతురే పుట్టంది. దీంతో 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్'లో హీరోహీరోయిన్లు అయిన ముగ్గురికీ ఆడపిల్లనే పుట్టిందని నెటిజన్లు అంటున్నారు.

(ఇదీ చదవండి: ఆ హాలీవుడ్ మూవీ చూస్తుంటే 'జెర్సీ' గుర్తొచ్చింది: నాగవంశీ)

Videos

కొండేపిలో నూతన YSRCP ఆఫీస్ ప్రారంభం

అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వెంగమాంబ క్రషర్ స్టోన్

మూడు గంటలకు పైగా ఎంపీ P.V మిథున్ రెడ్డిని - విచారిస్తున్న సిట్

Nallakunta: ప్రతి సంవత్సరం వర్షం వస్తే ఇదే పరిస్థితి అంటూ కాలనీవాసుల ఆవేదన

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి

ఐర్లాండ్ లో బయటపడిన భయానక రహస్యం

కుండబద్దలుకొట్టిన DGలు

అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌ కేసు

దమ్ముంటే ఆధారాలు చూపించండి.. లిక్కర్ కేసుపై శైలజానాథ్ రియాక్షన్

Visakhapatnam: ఐటీసీ గోడౌన్ లో చెలరేగిన మంటలు

Photos

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)

+5

ట్రైలర్ లాంచ్ ఈవెంటో మెరిసిన నటి డింపుల్ హయాతీ (ఫొటోలు)

+5

విజయవాడ : సారె తెచ్చి..మనసారా కొలిచి..కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

జడివానకు హైదరాబాద్‌ అతలాకుతలం.. ట్రాఫిక్‌ జామ్‌తో చుక్కలు చూసిన వాహనదారులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన..చెరువుల్లా మారిన రోడ్లు (ఫొటోలు)

+5

‘నా సీతా సీమంతం’ శ్రీమతి సీమంతంపై బిగ్‌బాస్‌ ఫేం పోస్ట్‌ (ఫొటోలు)

+5

‘నేను నా శివయ్య’ అంటున్న ఈ భక్తురాల్ని చూశారా?