Breaking News

బాక్సాఫీస్ షేక్ చేస్తోన్న చిన్న సినిమా.. ఏకంగా షారూక్‌ మూవీ రికార్డ్‌ బ్రేక్‌!

Published on Wed, 09/18/2024 - 14:00

బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌, రాజ్‌కుమార్‌ రావు నటించిన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ చిత్రం స్త్రీ 2 తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్‌లోనే దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటిస్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్‌ జవాన్‌ మూవీని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది.

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం జీవితకాల కలెక్షన్లను స్త్రీ-2  అధిగమించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జవాన్‌ రూ.640.25 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించగా.. హిందీలో మాత్రమే రూ.582.31 కోట్లు రాబట్టింది. ఈ ఏడాదిలో స్త్రీ-2 ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద కేవలం హిందీలోనే రూ.586 కోట్ల వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్ట్రీ 2 నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ భారతదేశంలోనే 'ఆల్ టైమ్ నంబర్ వన్ హిందీ చిత్రం' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

కాగా.. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ 2లో వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ కూడా అతిథి పాత్రలు పోషించారు. గతంలో స్త్రీ (2018) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా.. గతేడాది షారూక్- ‍అట్లీ డైరెక్షన్‌లో వచ్చిన  యాక్షన్ థ్రిల్లర్ జవాన్‌ బాక్సాఫీస్ వద్ద రికార్డ్‌ స్థాయి వసూళ్లు రాబట్టింది.
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)