Breaking News

మారడోనా టు పారషూట్

Published on Sun, 12/15/2024 - 12:32

ఎక్కడ పోగొట్టుకున్నామో, అక్కడే వెదుక్కోవాలి అన్నట్టు.. నటి శరణ్య రామచంద్రన్‌ నాయర్‌ కూడా ఎక్కడైతే తన నటనపై విమర్శలను ఎదుర్కొందో అక్కడే ప్రశంసలను అందుకోవాలని నిశ్చయించుకుంది. సినిమాలు, సిరీస్‌లలో అభినయిస్తూ ప్రేక్షకులను, విమర్శకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె గురించి కొన్ని విషయాలు..

శరణ్య పుట్టి, పెరిగిందంతా కేరళలోని తిరువనంతపురంలో. ఎమ్‌బీఏ చేస్తున్నప్పుడు పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎమ్‌బీఏ పూర్తయిన తర్వాత సొంత బిజినెస్‌ మొదలుపెట్టాలనుకుంది.  

వరుస మోడలింగ్‌ అవకాశాలతో ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మరెన్నో ఫొటో షూట్స్‌తో బిజీగా మారింది. అలా ఓ యాడ్‌ ఫిల్మ్‌ చేస్తున్నప్పుడే సినిమా చాన్స్‌ వచ్చింది.

ఒక్క సినిమా చేసి వెళ్లిపోదాం అనుకుంది. కానీ, ఆ చిత్రం ‘మారడోనా’  పెద్దగా ఆడలేదు. శరణ్య యాక్టింగ్‌పై కూడా నెగటివ్‌ కామెంట్స్‌ వచ్చాయి. దాంతో, నటిగా తనేంటో నిరూపించుకోవాలని నిశ్చయించుకుంది.

తను నటించిన ‘టూ స్టేట్స్‌’, ‘మై నేమ్‌ ఈజ్‌ అళగన్‌’, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా పరవాలేదు అనిపించాయి. ‘ఝాన్సీ’ సిరీస్‌తో వెబ్‌ దునియాలోకీ అడుగు పెట్టి తెలుగు వీక్షకులకూ పరిచయమైంది.

ప్రస్తుతం తను నటించిన ‘పారషూట్‌ ’ సిరీస్‌ తెలుగు, తమిళ, మలయాళంతో పాటు పలు భాషల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. వీక్షకాదరణ పొందుతోంది.

ఆనందం అనేది ఎవరో ఇస్తే రాదు. మనలోనే ఉంటుంది. అందుకే నేనెప్పుడూ నా మనసు చెప్పిందే వింటాను.
– శరణ్య రామచంద్రన్‌ నాయర్‌.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)