Breaking News

అభిమానుల దెబ్బకు ఇన్‌స్టాను తొలగించేసిన స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌

Published on Thu, 04/18/2024 - 18:26

విజయ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’. ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్‌ పోడు..’ అనే పాట లిరికల్‌ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్‌. మదన్  కర్కే లిరిక్స్‌ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్‌ప్రభు, యువన్ శంకర్‌ రాజా, ప్రేమ్‌గీ ఆలపించారు. అయితే ఈ సాంగ్‌ వల్ల మ్యూజిక్‌ డైరెక్టర్‌ యువన్‌ శంకర్‌ రాజా దారుణమైన ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్నాడు.

యూట్యూబ్‌లో విజిల్ పోడు పాటను మిలియన్ల కొద్ది ప్రేక్షకులు చూశారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ పాటకు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొందరి నుంచి నెగటివ్‌ కామెంట్లు వచ్చాయి. పాటలో మ్యూజిక్‌ పరమచెత్తగా ఉందని యువన్‌ శంకర్‌ రాజాపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా అనిరుద్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అనిరుధ్‌ను పొగుడుతూ యువన్‌ను తక్కవ చేసి కామెట్లు చేస్తున్నారు.  ఈ క్రమంలో వారందరూ కూడా యువన్ శంకర్ రాజాను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు.  దీంతో ఆందోళన చెందిన యువన్ శంకర్ రాజా ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి తప్పుకున్నారు. తన అకౌంట్‌ను తొలగించేశారు.

కొందరి అభిమానుల వల్లే యువన్ శంకర్ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారని యువన్ ఫ్యాన్స్‌ పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజిల్ పోడు పాట విజయ్ పార్టీ ఎన్నికల ప్రచార గీతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. యువన్ నుంచి ఇలాంటి పాట వస్తుందని ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో, యువన్ శంకర్ రాజా తన ఎక్స్‌ పేజీలో ఒక కామెంట్‌ చేశారు. 'నా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో సాంకేతిక లోపం కారణంగా, నా పోస్ట్‌లు తొలగించబడ్డాయి. అభిమానుల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధన్యవాదాలు, నేను నా ఇన్‌స్టాగ్రామ్ పేజీని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం అయితే యువన్‌ శంకర్‌ రాజా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా వినియోగంలో లేదు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)