Breaking News

హీరో విజయ్ ఇలా చేస్తారనుకోలేదు.. పోస్టర్‌పై తీవ్ర విమర్శలు!

Published on Sun, 06/18/2023 - 07:46

నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్‌ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్‌ లలిత్‌కుమార్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌, నటుడు అర్జున్‌, మన్సూర్‌ అలీఖాన్‌ దర్శకుడు మిష్కిన్‌, గౌతమ్‌ వాసుదేవన్‌, శాండీ మాస్టర్‌, మాథ్యూథామస్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

(ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్)

మాస్టర్‌ చిత్రం తర్వాత విజయ్‌, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్‌ వైరల్‌ అవుతోంది.

తాజాగా మరో అప్‌డేట్‌ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్‌ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్‌ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్‌ పెట్టుకుని ఫోర్స్‌గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు.

(ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్‌)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)