Breaking News

మహేశ్‌- రాజమౌళి సినిమాకు 'డైలాగ్‌ రైటర్‌'గా ప్రముఖ దర్శకుడు

Published on Sun, 04/13/2025 - 09:23

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కుతున్న  యాక్షన్‌ అడ్వెంచర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఎవరెవరు భాగం అయ్యారు వంటి అంశాల గురించి పెద్దగా బయటి ప్రపంచానికి తెలియదు. గుట్టుచ‌ప్పుడు కాకుండా తనపని తాను చేసుకుంటూ రాజమౌళి వెళ్లిపోతున్నాడు. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జక్కన్న కేర్‌ తీసుకుంటున్నారు.

రాజమౌళి సినిమాలకు రెగ్యులర్‌గా పనిచేసే టీమ్‌ చాలా తక్కువగా ఉంటుంది. అయితే, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్‌ఎమ్‌ కీరవాణి మాత్రం ఆయన సినిమాలకు తప్పకుండా ఉంటారు. కెమెరామెన్‌, ఫైట్ మాస్టర్స్‌, డైలాగ్‌ రైటర్‌ వంటి వారిని జక్కన్న మారుస్తూ ఉంటారు. ఇప్పుడు  SSMB29 సినిమా డైలాగ్‌ రైటర్‌గా దర్శకుడు దేవా కట్టా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డైలాగ్ పార్ట్‌ మొత్తం ఆయన పూర్తి చేశారట. పవర్ ఫుల్ డైలాగులను ఆయన అందించారట. 

ఆయన దర్శకుడిగా ఆటోనగర్ సూర్య , ప్రస్థానం, రిపబ్లిక్‌ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఆయనకు లిటరేచర్‌లో మంచి ప్రావీణ్యం ఉండటంతో జక్కన్న ఈ ఛాన్స్‌ ఇచ్చారని తెలుస్తోంది. బాహుబలి కోసం డైలాగ్‌ రైటర్స్‌గా విజయ్‌ కుమార్‌, అజయ్‌ కుమార్‌ అనే ఇద్దరు యువకులతో పాటు దేవా కట్టా కూడా ఓ చేయి అందించారు. అయితే, ఆ తర్వాతి చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం బుర్రా సాయి మాధవ్‌ను తీసుకున్నారు.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)