అట్లీ, అల్లు అర్జున్‌ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌కు ఛాన్స్‌.. అందుకేనా ఈ కామెంట్‌?

Published on Thu, 04/10/2025 - 07:13

ఇటీవల పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న నటి సమంత తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. అంతకన్నా షోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త్వరలో మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా పుష్ప– 2 చిత్రంతో ప్రపంచ స్థాయిలో దుమ్మురేపిన నటుడు అల్లు అర్జున్‌ తాజాగా అంతకు మించిన చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయారు. ఆయన నటిస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రానికి సబంధించిన ప్రకటన  అట్టహాసంగా వెలువడిన విషయం తెలిసిందే. చేసిన ఐదు చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న యువ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్‌ నటించనున్నారు. కోలీవుడ్‌లో చిత్రం చేయాలన్నది అల్లు అర్జున్‌ చిరకాల కోరిక. 

చాలా కాలం క్రితమే లింగుసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబధించిన ప్రకటనను గ్రాండ్‌గా వెల్లడించారు. అయితే కారణాలేమైనా ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. అలాంటిది తాజాగా అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ వరల్డ్‌ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ రూ.600 కోట్ల బడ్జెట్‌లో ప్లాన్‌ చేస్తుంది. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఈ చిత్ర యూనిట్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో నటి సమంత కూడా ఉన్నారు. ఆమె ఇంతకు ముందు నటుడు అల్లు అర్జున్‌కు జంటగా సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో నటించారు. అదే విధంగా దర్శకుడు అట్లీతో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఈయన ఇంతకు ముందు దర్శకత్వం వమించిన మెర్సల్‌, తెరి చిత్రాల్లో నాయకిగా నటించారన్నది గమనార్హం. 

ఇకపోతే నటి సమంత నటుడు అల్లు అర్జున్‌ గురించి తన ఇన్‌స్ట్రాగామ్‌లో చేసిన పోస్ట్‌లో మళ్లీ ఒక ఏడాది.ఈ అద్భుతమైన నటుడి ఎదుగుదలను చూడటానికి సహనం పాటించలేకపోతున్నాను. తెరపై మిమ్మల్ని ఎప్పుడు చూసినా మధురమైన దిగ్భ్రాంతి. ప్రతిసారి హద్దులు దాటిన చర్యలకు ధన్యవాదాలు. మీ ఆరోగ్యం బాగుండాలి. ఆసక్తి తగ్గకుండా మీరు ప్రేమించే కార్యాలను వరుసగా చేయాలని భగవంతుడు ఆశ్వీదించా అని నటి సమంత పేర్కొన్నారు. సమంత పోస్ట్‌ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా అల్లుఅర్జున్‌, అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈభారీ చిత్రంలో నటి సమంత కూడా భాగం కానున్నారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)