Breaking News

అమ్మకు జిరాక్స్ కాపీ.. ఈ ఫోటోలోని స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

Published on Thu, 08/14/2025 - 18:52

చిన్నప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే అచ్చం మీ నాన్నలా ఉన్నాడు. కాదు.. కాదు.. అంతా మీఅమ్మ పోలికే అని తెగ పొగిడేస్తుంటారు. పసితనంలో మన పాలబుగ్గలు చూస్తే ఎవరైనా సరే ముద్దాడకుండా ఉండలేరు. మనం బాల్యంలో ఎంత ముద్దుగా ఉంటామో.. పెరిగాక అదే గ్లామర్ఉండాలనుకోవడం కాస్తా ఎక్కువ ఆశ పడడమే అవుతుంది. కానీ కొందరు మాత్రం జిరాక్స్ తీసినట్లుగా తల్లిదండ్రుల పోలికలతో కనిపిస్తారు. అలాంటి వారు చాలా అరుదుగానే కనిపిస్తారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నా అనుకుంటున్నారా? గ్లామర్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న అందాల తార ముద్దుల కూతురి గురించే చర్చ.

నెల 13న అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్తో హీరోయిన్ మహేశ్వరి సైతం ఆమెతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న వారిలో అచ్చం శ్రీదేవిని తలపించేలా ఉన్న అందం ఎవరైనా ఉన్నారా అంటే.. అది కేవలం ఒక్క జాన్వీ కపూర్ మాత్రమే. తాజాగా జాన్వీ కపూర్అమ్మతో ఉన్న చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అమ్మ శ్రీదేవికి జిరాక్స్లా కనిపించే జాన్వీ కపూర్ముద్దు ముద్దుగా.. బొద్దుగా కనిపిస్తున్న ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

కేవలం అమ్మలాగా ఉండటమే కాదు.. ఆమెలా అన్ని సెంటిమెంట్స్కూడా పాటిస్తుంది. గతంలో ఇంటర్వ్యూలో చెప్పినట్లు శ్రీదేవికిఅత్యంత ఇష్టమైన ప్రదేశం తిరుమల. ప్రతినెల తిరుపతికి వెళ్లేదని జాన్వీకపూర్ చాలాసార్లు చెప్పింది. తాను అమ్మలాగే ప్రతినెల తిరుమలకు వెళ్తుంటానని తెలిపింది. అమ్మ సెంటిమెంట్ను తాను గౌరవిస్తానని వెల్లడించింది. ఏదేమైనా అమ్మలా కనిపించడమే కాదు.. ఆమె ఆచారాలు, సెంటిమెంట్ను గౌరవించే కూతురు ఉండడం చాలా అరుదని చెప్పొచ్చు.

ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తోంది. చిత్రంలో మెగా హీరో రామ్ చరణ్ సరసన హీరోయిన్కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి పరమ్ సుందరి మూవీలో నటించింది. సినిమా ఆగస్టు 29 థియేటర్లలో విడుదలవుతోంది.

 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు