Breaking News

ప్రేమలు చూసి నవ్వుతూనే ఉన్నాను: రాజమౌళి

Published on Wed, 03/13/2024 - 03:30

‘‘సాధారణంగా నేను ప్రేమకథలు, రొమాంటిక్‌ కామెడీ చిత్రాలను ఇష్టపడను. నాదంతా యాక్షన్, ఫైట్స్‌ స్టైల్‌. మలయాళ ‘ప్రేమలు’ సినిమా బాగుంది.. తెలుగులో రిలీజ్‌ చేస్తున్నాన ంటూ మా అబ్బాయి కార్తికేయ చెప్పడంతో.. ఏదో ఉత్సాహపడుతున్నాడులే అనుకున్నాను. సినిమాకి వెళ్లాక తొలి పదిహేను నిమిషాల తర్వాతి నుంచి చివరి వరకూ నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి. నస్లేన్‌ కె. గఫూర్, మమిత బైజు, శ్యామ్‌ మోహన్ , మాథ్యూ థామస్‌ కీలక పాత్రల్లో గిరీష్‌ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’.

మలయాళంలో హిట్‌గా నిలిచిన ఈ మూవీని ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ నెల 8న తెలుగులో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌ఎస్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ప్రేమలు’ మూవీకి డైలాగులను అద్భుతంగా రాశాడు ఆదిత్య. కొంచెం అసూయ, కొంచెం బాధతో ఈ మాటను ఒప్పుకోవాలి. మలయాళ నటీనటులందరూ చాలా బాగా యాక్ట్‌ చేస్తారు. ‘ప్రేమలు’లోని నటీనటులు అద్భుతంగా నటించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న సంగీతదర్శకుడు ఎంఎం కీరవాణి, దర్శకులు అనిల్‌ రావిపూడి, అనుదీప్‌ కూడా మాట్లాడారు.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు