Breaking News

జైలు నుంచి విడుదల, మహేశ్‌ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్‌.. వీడియో వైరల్‌

Published on Sat, 04/05/2025 - 17:05

రాజమౌళి (SS Rajamouli)తో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రతి ఒక్కరిలోని టాలెంట్‌ను పూర్తిగా బయటకు తీస్తాడు. అలాగే ఒక్కో సినిమా ఏళ్ల తరబడి చేస్తుంటాడు​. 2022లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న ఈయన ఈ ఏడాది ఆరంభంలో మహేశ్‌బాబు (Mahesh Babu)తో సినిమా మొదలుపెట్టాడు. జనవరిలో SSMB29 సినిమాను ఘనంగా లాంచ్‌ చేశారు. అంతేకాదు.. ఒక సింహాన్ని లాక్‌ చేసి తన పాస్‌పోర్ట్‌ తీసుకున్నట్లుగా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. 

మహేశ్‌ను లాక్‌ చేసిన జక్కన్న
అంటే తను తెరకెక్కించబోయే యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమాకు కోసం మహేశ్‌ను లాక్‌ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. దీనిపై ఎన్ని మీమ్స్‌ వచ్చాయో లెక్కే లేదు. ఇటీవలే ఒడిశాలో SSMB29 ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ప్రస్తుతం బ్రేక్‌ దొరకడంతో మహేశ్‌ తన కూతురు సితారతో కలిసి హాలీడే ట్రిప్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వీరిద్దరూ హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో మహేశ్‌.. జక్కన్న చేతికి చిక్కిన పాస్‌పోర్ట్‌ తిరిగి తనదగ్గరకు వచ్చేసిందంటూ నవ్వుతూ పాస్‌పోర్ట్‌ చూపించాడు.

కామెడీ టైమింగ్‌
ఇది చూసిన అభిమానులు.. బాబు తన పాస్‌పోర్ట్‌ చూపించడం హైలైట్‌, మహేశ్‌ కామెడీ టైమింగ్‌ గురించి తెలిసిందేగా.., బిడ్డకు విడుదల అంటూ కామెంట్లు చేస్తున్నారు. SSMB 29 విషయానికి వస్తే.. మహేశ్‌బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాను 2027లో రిలీజ్‌ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

 

 

చదవండి: పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. మోహన్‌బాబు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)