స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా?
Published on Wed, 09/21/2022 - 15:26
సూపర్ స్టార్ మహేశ్ బాబు-స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలె సెట్స్‌పైకి వచ్చింది. అంతేకాదు ఈ సినిమా కోసం మేకోవర్ కూడా అయ్యాడు మహేశ్. ఆయన న్యూలుక్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ స్టార్ట్స్ అంటూ సెప్టెంబర్ 13న సెట్స్‌లోని ఓ సన్నివేశాన్ని షేర్ చేసింది చిత్ర బృందం.
చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్‌మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే!
అయితే యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించాడట త్రివిక్రమ్. ఈ క్రమంలో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందని, సెకండ్ షెడ్యూల్ దసరా తర్వాతే అంటూ తాజాగా మూవీ యూనిట్ ప్రకటన ఇచ్చింది. ఇదిలా ఉంతే రెండు, మూడు రోజుల్లోనే తొలి షెడ్యూల్ పూర్తి కావడంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. దీని వెనక ఓ కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ తాజా బజ్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్‌ను కావాలనే ఆపేసారంటున్నారు. ఇప్పటి వరకు చేసిన యాక్షన్ సీక్వెన్స్ విషయంలో మహేష్‌బాబు, త్రివిక్రమ్ సంతృప్తిగా లేరట. అనుకున్న విధంగా ఈ ఫైట్ సీన్లు రావడం లేదని, అందుకే షూటింగ్‌కు కావాలనే బ్రేక్ ఇచ్చినట్లు ఫిలిం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చదవండి: విషాదం.. స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాత్సవ మృతి
నిజానికి ముందుగా చేసుకున్న ప్లాన్ ప్రకారం తొలి షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు జరగాల్సి ఉందట. కానీ, యాక్షన్ సీన్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో ఆర్థాంతరంగా షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని సినీవర్గాల నుంచి సమాచారం. కాస్తా సమయం తీసుకుని ప్రస్తుత ఫైట్ మాస్టర్‌ని కొనసాగించాలా? కొత్త మాస్టర్‌ని తీసుకోవాలా? అనే కీలక నిర్ణయం తీసుకొనున్నాడట దర్శకుడు. ఆ తర్వాతే తిరిగి షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకే దసరా వరకు త్రివిక్రమ్ టైం తీసుకుంటున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే చిత్ర బృందం స్పందించేవరకు వేచి చూడాల్సిందే.
First schedule of #SSMB28 has been completed with some kick-ass high octane epic action scenes 🔥
— Naga Vamsi (@vamsi84) September 21, 2022
Thank you @anbariv masters for amazing stunt choreography 🤗
The second schedule will start post Dussehra with our Superstar @urstrulyMahesh garu & butta bomma @hegdepooja.
Tags : 1