Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన ఆంథాలజీ.. తెలుగులో స్ట్రీమింగ్

Published on Wed, 04/30/2025 - 10:04

ఒకప్పటితో పోలిస్తే వారంతో సంబంధం లేకుండా ఓటీటీలోకి కొత్త సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. ఇతర భాషల్లో రిలీజైనవి కూడా కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలా ఓ సిరీస్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటి సంగతి? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.

సోనియా అగర్వాల్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సిరీస్ 'ష్'. ఇది నాలుగు కథల సమాహారం. లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని బోల్డ్ గానే చూపించే ప్రయత్నం చేశారు. స్కూల్ ఏజ్ లో సె*క్స్ ఎడ్యుకేషన్.. పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత శృంగార జీవితం తదితర స్టోరీలతో ఈ ఆంథాలజీ తీశారు. పృథ్వీ ఆదిత్య‌, వాలి మోహ‌న్ దాస్‌, హ‌రీష్, కార్తీకేయ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

(ఇదీ చదవండి: ‍అల్లు అర్జున్ కోసం ఫ్లాపుల హీరోయిన్?)

గతేడాది తమిళంలో రిలీజ్ కాగా.. దీని తెలుగు వెర్షన్ ఇప్పుడు(ఏప్రిల్ 30 నుంచి) ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఒరిజినల్ వెర్షన్ అయితే ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 

నెట్ ఫ‍్లిక్స్ లో అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన 'లస్ట్ స్టోరీస్' స్ఫూర్తితో ఈ ఆంథాలజీని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే మీకు ఇది అర్థమైపోతుంది. ఇందులో మరీ అంత బోల్డ్ సీన్స్ లేవని, క్లైమాక్స్ ని ఓపెన్ ఎండింగ్ తో ముగించడం కాస్త అసంతృప్తిని కలిగించిందని తమిళంలో రిలీజైనప్పుడు అన్నారు. మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)