Breaking News

నా కల నెరవేరింది: తమన్‌

Published on Sat, 11/16/2024 - 02:26

‘‘బాయ్స్‌’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్‌ డైరెక్టర్‌ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్‌ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్‌ చేంజర్‌’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్‌ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.

ఈ సందర్భంగా శుక్రవారం తమన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్‌ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్‌ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్‌ కొట్టినా వేస్ట్‌. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్‌ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్‌ ఎక్కువగా వినిపించాలి.

తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్‌ చేంజర్, డాకు మహారాజ్‌’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్‌ క్రియేట్‌ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్‌’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్‌ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్‌’లో ఆరు పాటలుంటాయి. 

ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్‌–డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్‌ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్‌ స్కూల్‌ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)