Breaking News

ఇండస్ట్రీకి  ఇంకో పిచ్చోడు దొరికాడు: రాజమౌళి

Published on Tue, 05/31/2022 - 19:08

‘నాలుగేళ్ల క్రితం కరణ్‌ జోహార్‌ ఫోన్‌ చేసి ఒక పెద్ద సినిమా చేయబోతున్నాను. మా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ ఒకసారి మీకు కథ వినిపిస్తాడు. నచ్చితే మిమ్మల్ని సౌత్‌ ఇండియాలో ఈ మూవీ సమర్పకుడిగా అనుకుంటున్నాను అని చెప్పారు. ఆ తరువాత మొదటి సారి అయాన్ ను కలిసాను. ఆయన  కథ చెప్పిన విధానం కంటే ఆయన బ్రహ్మాస్త్ర సినిమా మీద పెంచుకున్న ప్రేమ, తను చెప్తున్నా ఎక్సయిట్మెంట్ కి నేను చాలా చాలా ఇంప్రెస్‌ అయ్యాను. ఆ తరువాత తను తయారుచేసుకున్న  విజువల్స్, అప్పటివరకు  షూట్ చేసిన మెటీరియల్ అంత చూపిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి ఇంకో పిచ్చోడు దొరికాడని ఫిక్స్ అయ్యాను’అని అన్నారు దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ జంటగా తొలిసారి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి, రణ్‌బీర్‌,దర్శకుడు అయాన్‌ ముఖర్జీ మంగళవారం వైజాగ్‌లో సందడి చేశారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ‘బ్రహ్మాస్త్ర సినిమా పెద్ద స్క్రీన్‌ మీదే చూడాలని తీశారు. డైరెక్టర్‌ అయాన్‌ ఈ మూవీని నాకు 20 నిమిషాలే చూపించి, మా నాన్న(రచయిత విజయేంద్రప్రసాద్‌)కు మొత్తం చూపించాడు. ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీసి పెట్టుకున్నాడు అని నాన్నగారు చెప్పారు. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత నేను రెండుసార్లు ముంబైకి వెళ్లాను అయినా నాకు సినిమా మొత్తం చూపించలేదు. అయినా  అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి రెండు మెతుకులు ముట్టుకుంటే చాలు అన్నట్లు, నాకు ఆ 20 నిమిషాల్లోనే తెలిసిపోయింది’అని అన్నారు. ఇక అలియా భట్ గురించి ప్రస్తావిస్తూ  ఆమె ఈ సినిమాలో ఉండటం దర్శకుడి అదృష్టం, రణబీర్ హృదయంలో ఉండటం రణబీర్ అదృష్టం అని చెప్పుకొచ్చారు. 

దర్శకుడు అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైంది, దీనికి రెండు కారణాలు ఉన్నాయ్, నా రెండో సినిమా "యే జవానీ హై దీవానీ" తొమ్మిదేళ్ల  క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది.  ఈ సినిమా కోసం నేను పదేళ్లు తీసుకున్నాను. నేను చాలా పెద్దగా ఊహించాను. మునుపెన్నడూ తీయని ఒక గొప్ప సినిమాను తీయాలనే  ఆలోచన నాకు ఉండేది. అప్పటికీ రాజమౌళి  ఇంకా బాహుబలి కూడా చెయ్యలేదు. 

ఇంత గొప్ప సినిమాను ఊహించేది నేను మాత్రమే అని ఫీల్ అయ్యేవాన్నీ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు 10, 20 సంవత్సరాల క్రితం రాసిన కామిక్ బుక్స్ ఆధారంగా తీసినవే. వాటితోనే అంత కంటెంట్ క్రియేట్ చేసి ఆదరణ పొందినప్పుడు. ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న  మన భారతీయ చరిత్రను యధార్ధంగా ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఆలోచన నుంచి వచ్చిన చిత్రమే ఈ బ్రహ్మస్త్రం. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి వాటి మూలాలు ఈ సినిమా బ్రహ్మస్త్రం సినిమాకి ఆధారం అని చెప్పుకొచ్చారు. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)