Breaking News

రాజమౌళిపై ట్రోలింగ్‌.. 'మీరు ఇండియన్స్‌ కాదా?'

Published on Mon, 01/27/2025 - 13:20

కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 25న) పద్మ అవార్డులు (Padma Awards 2025) ప్రకటించింది. వీటిలో ఏడు పద్మ విభూషణ్‌, 19 పద్మ భూషణ్‌, 113 పద్మ శ్రీ పురస్కారాలున్నాయి. వీటిని అందుకున్నవారిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్‌ రెడ్డి పద్మ విభూషణ్‌ అందుకున్నారు. కేఎల్‌ కృష్ణ (విద్యా సాహిత్యం) , మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మిరియాల అప్పారావు (కళారంగం), వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించాయి. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు.

తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలు
ఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli  సోషల్‌ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్‌ చేశాడు. 'ఈసారి తెలుగువారికి ఏడు పద్మ అవార్డులు రావడం సంతోషకరం. పద్మ భూషణ్‌కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. పద్మ పురస్కారం గెల్చుకున్న తెలుగువారితో పాటు, ఇతర భారతీయులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్‌లో బాలీవుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కపూర్‌, తమిళ స్టార్‌ అజిత్‌ను ప్రశంసించాడు.

బేధాలు దేనికి?
ఇది కొంతమందికి అస్సలు మింగుడుపడలేదు. తెలుగువారు అని ప్రత్యేకంగా వర్ణించడం దేనికని విమర్శిస్తున్నారు. 'తెలుగువారు దేశంలో భాగం కాదా? ఎందుకని ప్రాంతాల మధ్య అడ్డుగోడ కడుతున్నారు?', 'తెలుగుప్రజలు భారతీయులు కాదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాల గురించి చర్చే లేదు. కానీ మీలాంటివాళ్లు మాత్రం ఈ అంశాన్ని బాగా వాడుకుంటారు. నార్త్‌ జనాలు మీ సినిమాలకు ఎందుకు సపోర్ట్‌ చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మనమంతా భారతీయులం అని చెప్పే ధైర్యం లేని వాళ్లకు మద్దతు దేనికి?' అని హిందీ ఆడియన్స్‌ ఘాటుగా కామెంట్స్‌ చేస్తున్నారు.

పుట్టిన గడ్డ తర్వాతే ఏదైనా..
ఈ ట్రోలింగ్‌ చూసిన తెలుగు సినీ ప్రియులు, అభిమానులు వారికి ధీటుగా రిప్లై ఇస్తున్నారు. పుట్టిన గడ్డ ఎవరికైనా తల్లితో సమానం. మొదటగా ప్రాంతం.., తర్వాతే దేశం వస్తుంది. అయినా రాజమౌళి తన ట్వీట్‌లో నార్త్‌, సౌత్‌ అని ఎక్కడా తేడా చూపించలేదు. తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డాడంతే.. మీ హాఫ్‌ నాలెడ్జ్‌తో ఆయన్ను విమర్శించకండి అని బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

 

చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)