Breaking News

ఈ హీరోయిన్లకు అదృష్టం లేదా?

Published on Wed, 08/23/2023 - 15:53

చిత్రపరిశ్రమలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వరుసగా బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చినా కొంతమందికి అవకాశాలు రావు. మరికొంతమందికి వరుస ఫ్లాప్‌లు వచ్చిన క్రేజీ ఆఫర్స్‌  వరిస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి బాగా జరుగుతుంటాయి. సినిమా హిట్‌ అయితే ఆ క్రెడిట్‌ హీరోకి వెళ్తుంది. ఫ్లాప్‌ అయితే మాత్రం ఆ భారం హీరోయిన్‌ మోయాల్సి వస్తుంది. ఒకటి, రెండు చిత్రాలు హిట్‌ కాకపోతే చాలు ఎంత పెద్ద స్టార్‌ హీరోయిన్‌ అయినా పక్కన పెట్టేస్తారు. పోనీ హిట్‌ ఇచ్చినా అవకాశాలు ఇస్తారా అంటే అదీ లేదు. టాలీవుడ్‌లో వరుస హిట్స్‌ ఇచ్చిన ఈ  హీరోయిన్లకు ఇప్పటికీ సినిమా ఛాన్స్‌లు రావడం లేదు. 

పాన్‌ ఇండియా హిట్‌...బట్‌ నో చాన్స్‌
‘కేజీయఫ్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తుంపు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. ప్రశాంత్‌ నీల్‌-యష్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీయఫ్‌ 2 కూడా భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఈ రెండు చిత్రాలలో శ్రీనిధి పెర్ఫామెన్స్ కూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తన అందాలకు ముగ్దులయ్యారు. వరుస సినిమాల అవకాశాలు వస్తాయని అంతా భావించారు.కానీ ఈ భామకు కేజీయఫ్‌ 2 తర్వాత ఆ స్థాయిలో ఒక్క పెద్ద సినిమా కూడా రాలేదు. తమిళ స్టార్ చియాన్ విక్రమ్ సరసన ‘కోబ్రా’లో మెరిసింది. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్ట్స్ సినిమాలతోనైనా అలరిస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికీ ఆఫర్లే అందకపోవడం గమనార్హం.

‘అఖండ’విజయం కానీ.. 
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమాతో తెలుగులో  హీరోయిన్ గా పరిచయం అయింది ప్రగ్యా జైస్వాల్‌ .ఆ సినిమా లో తన క్యూట్ లుక్ తో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే ఆ సినిమా తరువాత ఎన్ని సినిమాల లో నటించినా అవి అంతగా ఆకట్టుకోలేక పోయాయి. చాలా కాలం తర్వాత ‘అఖండ’తో భారీ విజయం సాధించింది. బోయపాటి-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ కలెక్టర్‌గా నటించింది. తన గ్లామర్ తో ఆకట్టుకుంటూనే అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.అయితే అఖండ సినిమా తరువాత ఈ భామ కు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్స్‌.. అయినా కూడా..
భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచమైంది సంయుక్త మీనన్‌. ఈ మూవీలో రానాకు జోడీగా నటించింది.  తర్వాత కల్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కొట్టింది. ఆ వెంటనే ధనుష్‌తో కలిసి ‘సార్‌’ మూవీలో నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ సాధించింది.

ఇక ఈ మధ్య మెగా హీరో సాయితేజ్‌తో కలిసి ‘విరూపాక్ష’లో నటించగా.. అది కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది. ఇలా హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న సంయుక్తకు మొన్నటి వరకు సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’లో లీడింగ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. వీళ్లే కాదు.. దసరా లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కీర్తి సురేశ్‌కు, బేబీ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత వైష్ణవికి కూడా సరైన ఆఫర్లు రాలేవు. వీరిద్దరు హీరోయిన్లుగా కమిట్‌ అయినా చిత్రాలే లేవు. అన్ని ఉన్నా అదృష్టం లేకపోతే ఏది దక్కదంటారు. మరి ఆ అదృష్టం ఈ అందగత్తెలకు ఎప్పుడు వస్తుందో చూడాలి. 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?