Breaking News

ఆ ఇంట్లో ఉండాలనిపించలేదు.. డిప్రెషన్‌లోకి వెళ్లా: శ్రీనిధి శెట్టి

Published on Thu, 05/08/2025 - 13:14

తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించిన నటి శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty ). యష్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ కన్నడ భామ, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’తో దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గడించింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత శ్రీనిధికి వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళంలో విక్రమ్‌తో ‘కోబ్రా’ చిత్రంలో నటించగా, నాని నటించిన ‘హిట్: ది థర్డ్ కేస్’(HIT3)తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా ఎదగడానికి శ్రీనిధి చాలానే కష్టపడింది. ఎన్నో బాధలను అదిగమించి ఈ స్థాయికి చేరుకుంది. చిన్నతనంలోనే ఆమె అమ్మను కోల్పోయింది. కొన్నాళ్ల పాటు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిందట. బెంగళూరికి వచ్చిన తర్వాతే తన జీవితం మారిపోయిందంటోంది శ్రీనిధి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి మాట్లాడుతూ.. ఎమోషనల్‌ అయింది.

‘నేను పదో తరగతి చదువుతున్న సమయంలో మా అమ్మ చనిపోయింది. ఆ షాక్‌ను నేను తట్టుకోలేకపోయాను. కొన్నాళ్లపాటు డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఆ ఇంట్లోనే ఉండాలనిపించలేదు. గతాన్ని మర్చిపోయేందుకు బెంగళూరుకు వెళ్లిపోయాను. అయినా, అమ్మను మర్చిపోలేకపోయాను. చాలా రోజులు ఆమెను తలుచుకుంటూ ఏడ్చాను. ఈ ఘటన నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. 

బెంగళూరుకు వచ్చిన తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. జైన్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత, కొంతకాలం అక్సెంచర్‌లో ఉద్యోగం చేశా. మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాను. 2016లో మిస్ సుప్రానేషనల్ టైటిల్‌ గెలవడం.. అక్కడ సినిమాల్లోకి రావడం.. పాన్‌ ఇండియా సినిమాల్లో నటించడం.. ఇవన్నీ ఓ కలలా అనిస్తున్నాయి’ అని శ్రినిధి చెప్పుకొచ్చింది. ఇక తండ్రి గురించి మాట్లాడుతూ.. నాన్నతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. ఆయన నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారు’ అని చెప్పింది.

శ్రినిధి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ‘హిట్: ది థర్డ్ కేస్’తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆమెకు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న ‘తెలుసు కదా’, కిచ్చా సుదీప్‌తో ‘కిచ్చా 47’ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇటీవల నితేష్ తివారీ రామాయణంలో సీత పాత్ర కోసం ఆమెకు అవకాశం రాగా, ‘కేజీఎఫ్’లో యష్‌తో జంటగా నటించిన కారణంగా ఆ పాత్రను వదులుకున్నట్లు తెలిపింది.

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)