Breaking News

నాని నన్ను తిట్టాడు..కొట్టాడు.. ఇదంతా నిజమే : శ్రీకాంత్‌ ఓదెల

Published on Sat, 09/26/2026 - 18:58

ది ప్యారడైజ్‌  షూటింగ్‌ సమయంలో నానికి, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలకి మధ్య గొడవ జరిగినట్లు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్‌పై నాని సీరియస్‌ అయ్యాడని.. శ్రీకాంత్‌ కూడా నానితో గొడవపడ్డాడని సోషల్‌ మీడియాలో పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై శ్రీకాంత్‌ ఓదెల స్పందించాడు.

‘ది ప్యారడైజ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌లో శ్రీకాంత్‌ మాట్లాడుతూ..‘షూటింగ్‌ సమయంలో కొన్ని వార్తలు చదివాను. నాని అన్నకు కోసం వచ్చింది. నన్ను తిట్టాడని, కొట్టాడని..‘శ్రీకాంత్‌ గాడు అలిగాడు..అరిచాడు’అనిఇలా ఏదోదో రాసినట్లు విన్నాను. అవును అది నిజమే. నాని అన్న తిట్టిన మాట నిజమే.నేను అరిచిన మాట నిజమే కావొచ్చు. కానీ..నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పాలనుకున్నది ఏంటంటే.. ‘నాని అన్న నేను కలిసి దసరా, ప్యారడైజ్‌ , రేపు ఇంకో సినిమా చేయొచ్చు. అయితే మా ఇద్దరి ఎమోషన్‌ ని ఆ సినిమాలో పెట్టకూడదు. వేరే వాళ్ల సంగతి నాకు తెలియదు కానీ.. ఈ సినిమాల్లో మాత్రం మా ఇద్దరి ఎమోషన్‌ని పెట్టకూడదు. కచ్చితంగా నాని అన్న నన్న భరించాల్సిందే. మోయాల్సిందే..వేరే ఆప్షన్‌ లేదు. దీంట్లో తన్నుకుంటాం..ముద్దు పెట్టుకుంటాం..మూతులు నాక్కుంటాం..అది ఏది ఉన్నా సినిమా కోసమే. కొన్ని ఎమోషన్స్‌  బతుకు దగ్గర చూడకూడదు. చావుని దాటి చూడాలి. నాని అన్నతో నా బంధం ఇక్కడికే ఆగిపోయేది కాదు’ అని ఎమోషనల్‌గా చెప్పాడు. 

ది ప్యారడైజ్‌ విషయానికొస్తే.. నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కయాదు లోహర్‌ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 24న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. అయితే కలెక్షన్స్‌ మాత్రం భారీగానే వచ్చాయి. రెండు రోజుల్లోనే రూ. 114 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. 

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)