Breaking News

కథ చాలా కొత్తగా ఉంది: బాబీ కొల్లి

Published on Wed, 12/25/2024 - 00:08

‘‘నేను, మోహన్‌ కలిసి రైటర్స్‌గా పని చేశాం. తను ఈ సినిమాని వినోదంతో పాటు సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ అంశాలతో తీశాడని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని డైరెక్టర్‌ బాబీ కొల్లి అన్నారు. ‘వెన్నెల’ కిశోర్‌ టైటిల్‌ రోల్‌లో, రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా, శియా గౌతమ్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌’. లాస్యా రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్స్‌ బాబీ కొల్లి, కల్యాణ్‌ కృష్ణ అతిథులుగా హాజరయ్యారు. ‘‘ఈ సినిమా కంటెంట్‌ని బలంగా నమ్మాను. ఆ కథే నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వంశీ నందిపాటి. ‘‘నా కెరీర్‌లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది’’ అని అనన్య నాగళ్ల పేర్కొన్నారు. ‘‘నటుడిగా ఈ చిత్రం నాకు చాలా కీలకం’’ అన్నారు రవితేజ మహాదాస్యం. ‘‘ఈ మూవీతో కచ్చితంగా హిట్‌ సాధిస్తాం’’ అని వెన్నపూస రమణారెడ్డి చెప్పారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)