Breaking News

అతని కోసం రూ.70 లక్షలు వదులుకున్న శ్రీదేవి: బోనీ కపూర్

Published on Mon, 09/08/2025 - 18:44

దివంగత నటి శ్రీదేవి చివరి రోజుల కొన్ని దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించింది. వెండితెరపై తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది. కానీ ఊహించని విధంగా 2018లోనే ఓ హోటల్‌లో మరణించింది. ఆమె  చివరిసారిగా నటించిన చిత్రం మామ్. ఆమె భర్త బోనీ కపూర్‌ నిర్మాతగా ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఓ ఇంట‍ర్వ్యూకు హాజరైన బోనీ కపూర్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మామ్‌ కోసం శ్రీదేవి చాలా కష్టపడిందని అన్నారు. ఈ సినిమాకు తెలుగు, తమిళ, హిందీ వర్షన్స్‌కు తానే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుందని తెలిపారు. ఈ మూవీ కోసం తన రెమ్యునరేషన్ సైతం వదులుకుందని వెల్లడించారు.

బోనీ మాట్లాడుతూ.. "మామ్ షూటింగ్ సమయంలో మేము ఏఆర్ రెహమాన్‌ను తీసుకోవాలనుకున్నాం. కానీ అతనికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది. అంత ఖర్చు మేం భరించలేకపోయా.  శ్రీదేవి రెమ్యునరేషన్ కోసం కొంత మొత్తాన్ని పక్కనపెట్టాం. కానీ ఆమె నాకు బ్యాలెన్స్ డబ్బులేవీ వద్దు. ఆ మిగిలిన మొత్తం రూ.70 లక్షలు రెహమాన్‌కు ఇచ్చిన తీసుకురావాలని చెప్పిందని' గుర్తు చేసుకున్నారు.

అంతేకాకుండా మామ్ షూటింగ్ సమయంలో తనతో గది పంచుకోవడానికి కూడా శ్రీదేవి నిరాకరించిందని బోనీ కపూర్ వెల్లడించారు. సినిమా పట్ల అంత నిబద్ధతగా పనిచేసిందని తెలిపారు. ఈ సినిమా ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో.. ఆ తర్వాత జార్జియాలో చిత్రీకరించామన్నారు. సినిమా షూటింగ్‌ మొత్తం కాలంలో శ్రీదేవి ఎప్పుడూ గది పంచుకోలేదని వివరించారు. తన మైండ్‌సెట్ డైవర్ట్‌ కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆమె ఆ పాత్ర పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిందని పంచుకున్నారు.

కాగా.. ఇటీవల ఐఫా రజతోత్సవ వేడుకల సందర్భంగా బోనీ కపూర్‌.. మామ్ మూవీకి సీక్వెల్‌ను ప్రకటించారు. ఈ చిత్రం శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో నటించే అవకాశముందని బోనీ అన్నారు. కాగా.. 2017లో విడుదలైన మామ్ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కూడా నటించారు.  రూ.30 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.175 కోట్లు వసూలుచేసింది.
 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)