Breaking News

శ్రీరామ నవమి సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఆదిపురుష్‌ టీం

Published on Thu, 03/30/2023 - 10:12

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మైథలాజికల్‌ డ్రామా ‘ఆదిపురుష్‌’. రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతిసనన్‌ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్‌ పోషిస్తున్నారు.  బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్‌ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని జూన్‌ 16న రిలీజ్‌ చేస్తామని ఓం రౌత్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. సీతా సమేత శ్రీరాముడిగా ప్రభాస్‌ స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపించే శ్రీరాముడి ఫోటోకు ప్రతిరూపంగా ఈ తాజా పోస్టర్‌ని డిజైన్‌ చేశారు మేకర్స్‌. ‘మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్‌’ అనే క్యాప్షన్‌తో  సీతా, లక్ష్మణ సమేత శ్రీరాముడికి హనుమాన్ దండం పెడుతున్న ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా టీ-సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి