Breaking News

సినిమాలకు దూరంగా శ్రీలీల.. ఇప్పుడేం చేస్తుంది?

Published on Fri, 03/22/2024 - 15:30

నాలుగు నెలల కిత్రం.. టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్‌ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేంది. ఏ స్టార్‌ హీరో సినిమా చూసినా..అమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. కట్‌ చేస్తే.. ఇప్పుడు ఆ హీరోయిన్‌ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావుడి చేసి.. ఇప్పుడు సైలెంట్‌ అయిపోయింది. ఈ పాటికే ఆ హీరోయిన్‌ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా? మీరనకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీలను. నాలుగు నెలల్లో అర డజనుకు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల..ఇప్పుడు సైలెంట్‌ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ రావడం లేదు. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు?

పెళ్లి సందడిలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది.  ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్‌ హిట్‌ కావడం.. దానికి తన గ్లామర్‌, డ్యాన్స్‌ ప్రధాన కారణం అవ్వడంతో.. శ్రీలీల స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.


 
ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ, తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్‌, బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌లోకి వెళ్లింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసింది. 

రామ్‌ ‘స్కంధ’, వైష్ణవ్‌ తేజ్‌ ‘ఆదికేశవ’, నితిన్‌ ‘ఎక్‌ ట్రా ఆర్డినరీ మ్యాన్‌’.. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్‌ టాక్‌ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్‌ కేసరి’మాత్రం హిట్‌ టాక్‌కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇక సంకా​ంత్రికి వచ్చిన ‘గుంటూరు కారం’. కూడా యావరేజ్‌ టాక్‌ని సంపాదించుకుంది.ఆ సినిమాకు వచ్చిన ఆ కాస్త హిట్‌ క్రెడిట్‌ కూడా మహేశ్‌ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఇప్పడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాలీ సమయం దొరకడంతో చదువుపై ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దాం అనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)