Breaking News

పుష్ప-2 ఐటమ్ సాంగ్ ఎఫెక్ట్.. శ్రీలీల షాకింగ్ డిసిషన్!

Published on Sun, 12/08/2024 - 19:03

ప్రస్తుతం సినీప్రియులను పుష్ప-2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా అలరిస్తోంది. ఈనెల 5న థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఊచకోత కోస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌తో  సినీ ప్రియులను అలరించింది టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల. కిస్సిక్ అంటూ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రస్తుతం రాబిన్‌హుడ్‌లో నటిస్తోన్న శ్రీలీల ఐటమ్ సాంగ్‌తో మరింత ‍క్రేజ్ దక్కించుకుంది.

అయితే కిస్సిక్‌ సాంగ్ తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే అవీ హీరోయిన్‌గా కాదట. ఐటమ్ సాంగ్స్ చేసేందుకు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయట. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర చిత్రంలో ఐటమ్ సాంగ్‌ కోసం సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ భయంతోనే వరుస ఆఫర్లు  శ్రీలీల తిరస్కరించినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.

(ఇది చదవండి: పుష్పరాజ్ ఆల్‌ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?)

శ్రీలీల షాకింగ్ నిర్ణయం..

‍అయితే టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీలకు ఆ తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ముద్దుగమ్మ నితిన్ సరసన రాబిన్‌హుడ్‌తో ప్రేక్షకులను పలకరించనుంది. అంతకుముందు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ మూవీ కావడన్‌నే పుష్ప-2లో ఐటమ్‌ సాంగ్‌కు ఓకే చెప్పింది శ్రీలీల. ఈ సాంగ్ చేయడానికి ప్రత్యేక కారణముందని కూడా వెల్లడించింది.

అయితే తనపై ఐటమ్‌ సాంగ్‌ హీరోయిన్‌గా ముద్రపడుతుందేమో అన్న భయం పట్టుకుందన్న వార్త వైరలవుతోంది. అందువల్లే ఇకపై ఐటమ్ సాంగ్స్‌ చేయకూడదని శ్రీలీల నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐటమ్ సాంగ్ కోసం చాలామంది నిర్మాతలు శ్రీలీలను సంప్రదించేందుకు యత్నిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుందని టాక్.  ఏదేమైనా కిస్సిక్‌ సాంగ్‌తో శ్రీలీల క్రేజ్‌ మరింత పెరిగిందనే చెప్పాలి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌