Breaking News

అందుకే షాపు ఓపెనింగ్స్‌కి వెళ్తుంటా : శ్రీలీల

Published on Sun, 07/19/2026 - 08:45

తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలు చేసి పాన్‌ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్న నటి శ్రీలీల. ముందు డాక్టర్‌ అయి ఆ తర్వాత యాక్టర్‌ అయినా ఈ బ్యూటీ  అమెరికా , మెక్సికో జిల్లాలో పుట్టి బెంగళూరులో పెరిగారన్నది తెలిసిందే. కిస్‌ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయకగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పెళ్లి సందడితో తెలుగులో సందడి చేశారు. ఆ తర్వాత నటించిన ధమాకా చిత్రం మంచి విజయాన్ని అందించింది అంతే ఆపై వరుసగా స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ క్రేజీ హీరోయిన్గా రాణిస్తున్నారు. 

దీంతో ఓపక్క చిత్రాలు నటిస్తూనే మరోపక్క వాణిజ్య ప్రకటనలో నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అంతేకాకుండా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో  పాల్గొంటూ అభిమానులకు మరింత దగ్గర అవుతున్నారు. పుష్ప 2 చిత్రంలో కిసక్కు అనే ఐటెం సాంగ్లో నటించి కురక్రారును కిర్రెరక్కించారు. 

ఆ తర్వాత పరాశక్తి చిత్తంతో కోలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఒక హిందీ చిత్రంలో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయకగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఎక్కువగా షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొనడం గురించి ఆమె పేర్కొంటూ..‘ నాకు తరచూ అభిమానులను కలుసుకోవడం ఎంతో ఇష్టం. అభిమానులను ప్రత్యక్షంగా కలుసుకున్నప్పుడు వారు చూపే ప్రేమాభిమానాలు నాకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాంటి అభిమానుల కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. అభిమానుల అంచనాలను పూర్తి చేయడానికి మంచి మంచి కథా చిత్రాల్లో  నటించడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నటి శ్రీలీల పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో నటుడు ధనుష్‌కు జంటగా ఓం  చిత్రంతో పాటు ఒక హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)