Breaking News

హీరోయిన్‌ శ్రీలీలకు ముఖ్యమంత్రి గిఫ్ట్.. ఎందుకో తెలుసా?

Published on Wed, 04/02/2025 - 15:39

పెళ్లి సందడి తర్వాత టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది శ్రీలీల. ఇటీవలే నితిన్ సరసన రాబిన్‌హుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజై థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగులో స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్‌ సిక్కింలో జరుగుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ అంతా కలిసి ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సినిమా షూటింగ్ కోసం సిక్కింను ఎంచుకున్నందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల, అనురాగ్ బసుకు తమ రాష్ట్ర సంప్రదాయం ప్రతిబింబించేలా బహుమతులు అందజేశారు. అంతేకాకుండా మూవీ షూటింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్తాయిలో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.  ఈ విషయాన్ని సీఎంఓ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ అనురాగ్ బసు  ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తమ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తామని వెల్లడించారు. ఇక్కడ షూటింగ్‌ సమయంలో ప్రజల నుంచి వస్తున్న మద్దతు, ప్రేమ పట్ల చాలా సంతోషంగా ఉందని కార్తీక్ ఆర్యన్ అన్నారు. మాకు భద్రత కల్పించినందుకు సిక్కిం పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది మా షూటింగ్‌ సజావుగా పూర్తి చేసేందుకు సహకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. సిక్కింలోని ప్రకృతి దృశ్యాలు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తనను ఆకర్షించాయని హీరోయిన్ శ్రీలీల అన్నారు. ఈశాన్య రాష్ట్రానికి తన మొదటి పర్యటనను నా జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)