రష్మికను చూసి ఇబ్బంది పడ్డ శ్రీలీల.. ఎందుకో తెలుసా?

Published on Sun, 03/16/2025 - 15:43

శ్రీలీల(Sreeleela).. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది. ఒకవైపు స్టార్‌ హీరోలతో మరోవైపు యంగ్‌ స్టార్స్‌లో సినిమాలు చేస్తూ తెలుగు తెరపై దూసుకెళ్తోంది. అయితే ఈ టాలెంటెడ్‌ బ్యూటీ ఇటీవల తన దూకుడుని తగ్గించింది. ఈ మధ్యకాలంలో ఆమె నటించిన చిత్రాలేవి రిలీజ్‌ కాలేదు. కానీ పుష్ప 2లో ఐటమ్‌ సాంగ్‌ చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. ఒకవైపు హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తూనే.. సడెన్‌గా పుష్ప 2లో స్పెషల్‌ సాంగ్‌కి అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. ‘కిస్సిక్‌’ అంటూ సాగే ఈ పాట ఎంతపెద్ద హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. 

అయితే ఈ పాట ఒప్పుకునేందుకు శ్రీలీల కాస్త వెనకడుకు వేసిందట. కెరీర్‌ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచించిందట. కానీ డైరెక్టర్‌ సుకుమార్‌ నచ్చజెప్పి పాటకు ఒప్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ పాట శ్రీలీల కెరీర్‌కి ప్లస్సే అయింది. అయితే ఈ పాట షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు సెట్‌లో రష్మిక(rashmika mandanna)ను చూసి శ్రీలీల భయపడిందట. ఆమెతో మాట్లాడేందుకు కాస్త సిగ్గు పడిందట. దానికి గల కారణం ఏంటో కూడా శ్రీలీల వివరించింది.

శ్రీలీల హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్‌’. నితిన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. అయితే ఈ చిత్రంలో మొదట రష్మికను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొంతవరకు షూటింగ్‌ ప్రారంభించిన తర్వాత ఆమె ప్లేస్‌లో శ్రీలీలను తీసుకున్నారు. పుష్ప–2 ఐటమ్‌ సాంగ్‌ షూటింగ్‌లో మొదటిసారి రష్మికని కలిసినప్పుడు– రాబిన్‌హుడ్‌ రీ ప్లేస్‌మెంట్‌ గుర్తు వచ్చి, శ్రీ లీల ఇబ్బంది పడింది. అయితే డేట్స్‌ ప్రాబ్లమ్‌ వల్ల తనే రాబిన్‌హుడ్‌ సినిమా వదిలేశానని, రష్మిక చెప్పడంతో ఊపిరి పీల్చుకుందట శ్రీ లీల. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆమే చెప్పింది. ఇక  ఈ స్పెషల్‌ సాంగ్‌ కోసం శ్రీలీలకు మైత్రీ మూవీ మేకర్స్‌ భారీగానే పారితోషికం అందించిందట. ఈ ఒక్క పాటకే దాదాపు రూ. 2 కోట్లు అందించినట్లు సమాచారం. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)